Vemulawada : ఛత్తీస్‌గఢ్ టు వేములవాడ - పోలీసులకు చిక్కిన గంజాయి ముఠా
Vemulawada News : వేములవాడలో గంజాయి ముఠాను గుట్టు రట్టు చేశారు పోలీసులు. ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Vemulawada Crime News : ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ(Vemulawada)లో గంజాయి కలకలం సృష్టిస్తుంది. గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. చత్తీస్ గడ్ నుంచి వేములవాడకు అక్రమంగా గంజాయి తరలించే ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో అరెస్టు అయిన ముఠా వివరాలు వెల్లడించారు. వేములవాడ కు చెందిన వికాస్ కుమార్, అనుపమ్ దాస్, నరేందర్ ఛత్తీస్గఢ్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. యువత గంజాయికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సమూలంగా గంజాయిని నిర్మూలించేందుకు యుద్దం ప్రకటించాలని కోరారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 14 కేసులు నమోదు..
గంజాయి విక్రయించిన, సేవించిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహజన్ హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 14 కేసులు నమోదు చేశామని చెప్పారు. గత ఏడాది 79 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఇప్పటికే సస్పెక్టెడ్ షీట్ కూడా ఓపెన్ చేశామని ఎస్పీ చెప్పారు. గంజాయి విక్రరయించి ఇదివరకు పట్టుబడ్డ వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు రహస్యంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయించే వారు ఎక్కడున్నా తమకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేలా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పి కోరారు.
రిపోర్టింగ్ - HT Correspondent K.V.REDDY, Karimnagar
సంబంధిత కథనం