Jagityala Murder: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్య.. మృతుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి-ganga reddy a follower of mlc jeevan reddy was brutally murdered in jagityala district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagityala Murder: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్య.. మృతుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి

Jagityala Murder: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్య.. మృతుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి

HT Telugu Desk HT Telugu

Jagityala Murder: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీ కొట్టి కత్తులతో పొడిచి చంపారు. మృతుడు గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు.

జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్య

Jagityala Murder: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. మృతుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిగా గుర్తించారు.

బైక్‌పై వెళుతున్న గంగారెడ్డిని కార్‌తో వెనుక నుండి ఢీ కొట్టి కింద పడగానే కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. గంగారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షలే హత్యకు కారణమని అనుమానిస్తు హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల అదుపులో హంతకులు?

నడిరోడ్డుపై గంగారెడ్డి ని దారుణంగా హత్య చేసిన ముగ్గురిలో ఒకరు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. జీవన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న శ్రవణ్ మహేష్ మరొకరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తుంది. హంతకులు గంజాయి మత్తులో పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

జీవన్ రెడ్డి ఆందోళన..ఆగ్రహం

కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి హత్య జగిత్యాలలో ఆందోళనకు దారి తీసింది. ఘటనా స్థలానికి చేరుకొని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు.‌ గంగారెడ్డి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.రౌడీ షీటర్ 20 కేసులు ఉన్న వ్యక్తి శ్రావణ్ చంపుతానని బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోలేదని పోలీసులను నిలదీశారు. దసరా రోజున డీజే పగలగొట్టాడని ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోలేదన్నారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఈరోజు గంగారెడ్డి హత్యగురయ్యేవాడా? అని ప్రశ్నించారు.

రౌడీ షీటర్ గంజాయి మత్తు వల్లే గంగారెడ్డిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై కాల్ డాటా తీస్తే రౌడీ షీటర్ తో ఎన్నిసార్లు మాట్లాడరో తెలుస్తుందన్నారు. పోలీసుల అక్రమ దందా కాంగ్రెస్ ను హత్య చేస్తుందని ఆరోపించారు. నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

జీవన్ రెడ్డి కోసం పరితపించిన గంగారెడ్డి

జీవన్ రెడ్డికి మృతుడు గంగారెడ్డి ముఖ్య అనుచరుడు. జీవన్ రెడ్డి అంటే ప్రాణాలు ఇచ్చే అంత అభిమానం ఉన్న నాయకుడు గంగారెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సందర్భంలో కనీస సమాచారం లేకుండా పార్టీలో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి అలిగితే జీవన్ రెడ్డిని సముదాయించేందుకు ఆయన ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళితే గంగారెడ్డి కాళ్లు మొక్కి కన్నీటిపర్యంతమై జీవన్ రెడ్డి బాధను వివరించాడు.

మా సార్ కు అన్యాయం చేయొద్దంటూ జీవన్ రెడ్డిని వేడుకున్నారు. జీవన్ రెడ్డి కోసం ఎంతటికైనా తెగించే వ్యక్తి గంగారెడ్డి కావడంతో ఆయన హత్యను జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. జీవన్ రెడ్డి ఆందోళనతో ప్రభుత్వ విప్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం జగిత్యాలకు చేరుకుని నిరసన ఆందోళనలో పాల్గొన్నారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)