Congress Schemes: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ మరో రెండు పథకాలను నేడు సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆరు గ్యారంటీల్లో 6 Guarantee schemes మరో రెండు పథకాలను నేటి నుంచి అమలు చేయనున్నారు. సచివాలయంలో జరిగే కార్యక్రమంలో వీటిని సిఎం అధికారికంగా ప్రారంభిస్తారు.
ఆరు గ్యారంటీ హామీల్లో మరో రెండు హామీలను నేటి నుంచి తెలంగాణలో అమలు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సచివాలయంలోనే ప్రారంభించనున్నారు.
గృహ జ్యోతి Gruha jyothi పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న వారికి ప్రతి నెల 200యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మీ Mahalakshmi పథకంలో రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించే పథకాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రియాంకగాంధీ హాజరవుతారని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో ఆమె రావడం లేదని ప్రకటించారు.
ప్రియాంక గాంధీ ప్రసంగాన్ని వర్చువల్ విధానంలో ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. చేవెళ్ల సభకు పెద్ద ఎత్తున మహిళలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకాన్ని కూడా ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది.
ప్రభుత్వం రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలోనే ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభలో పథకాలను ప్రారంభించాల్సి ఉంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం సాయంత్రం షెడ్యూల్ విడుదలైంది. వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. వేదికను మారుస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.
మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలోనే రెండు గ్యారంటీ పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం చేవెళ్లలో యధావిధిగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు చేవెళ్ల సభ కోసం తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేసింది.