Free Coaching : ప్రభుత్వ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ - అర్హతలు, కావాల్సిన పత్రాలివే-free coaching for group 1 and other govt jobs in sc study circles in medak district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Free Coaching : ప్రభుత్వ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ - అర్హతలు, కావాల్సిన పత్రాలివే

Free Coaching : ప్రభుత్వ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ - అర్హతలు, కావాల్సిన పత్రాలివే

HT Telugu Desk HT Telugu
Feb 23, 2024 09:34 PM IST

Free Coaching For Govt Jobs 2024: గ్రూప్ 1తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఎస్సీ సంక్షేమ శాఖ. ఉచితంగా శిక్షణ పొందేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మెదక్ జిల్లా యంత్రాంగం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఉచిత కోచింగ్
ఉచిత కోచింగ్ (https://unsplash.com/)

Free Coaching : తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాలలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్టడీ సర్కిల్స్‌లో గ్రూప్- 1, ప్రభుత్వం భర్తీ చేయబడే ఇతర ఉద్యోగాల పోటీపరీక్షల శిక్షణ కొరకు నోటిఫికేషన్ ఈ రోజు జారీ చేయబడిందని మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయ లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఒక్కొక్క స్టడీ సర్కిల్ నందు 100 మందికి రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇందులో ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 15 శాతం సీట్లు ఉంటాయి. మొత్తంగా 33% సీట్లు మహిళలకు, 5 శాతం సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేయబడ్డాయి. భోజనం, వసతి, ఉత్తమ ఫ్యాకల్టీతో శిక్షణ, స్టడీ మెటీరియల్స్, డిజిటల్ క్లాసులు, రిఫరెన్స్ కోసం వందలాది పుస్తకాలు, నిరంతర మూల్యాంకనకై వారాంతపు పరీక్షలు మొదలగునవి కలిగిన ఈ శిక్షణ ఐదు నెలలపాటు కొనసాగుతుంది.

పోటీ పరీక్ష ద్వారా ఎంపిక...

ఈ స్టడీ సర్కిల్ లలో ప్రవేశానికి ఎంపిక, పోటీ పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 23 నుండి, స్టడీ సర్కిల్ వెబ్సైట్ http://tsstudycircle.co.in/ నందు దరఖాస్తు చేసుకొనవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ మార్చి 6, 2024. పరీక్ష యొక్క హాల్ టికెట్లు మార్చి 7వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. పోటీ పరీక్ష మార్చి 10, 2024 నాడు ఉదయం 11.00 గంటలు నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు స్టడీసర్కిల్స్ ఉన్న జిల్లా కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఆయా జిల్లా స్టడీసర్కిల్ పరిధిలో ఉత్తీర్ణత పొంది మెరిట్ సాధించిన 100 మందిని (రిజర్వేషన్లను వర్తింపజేస్తు) శిక్షణ కొరకు ఎంపిక చేయడం జరుగుతుంది. శిక్షణ మార్చి 18, 2024 నుంచి మొదలై ఆగస్టు 17, 2024 న ముగుస్తుందని తెలిపారు.

ఎంపిక అయినవారికి, అట్టి సమాచారం వారి మొబైల్ ఫోన్ కు మెసేజ్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియజేయబడుతుంది. మెయిల్ కూడా పంపించబడుతుంది. అంతే కాకుండా ఎంపికైన వారి వివరాలు స్టడీ సర్కిల్ లోనూ, ఆయా జిల్లాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలోనూ, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయంలోనూ నోటీసు బోర్డుపై ఉంచబడతాయని తెలిపారు. యస్.సి., యస్.టి., బి.సి (మైనారిటీలతో సహా) కులాలకు చెందిన, నలభై నాలుగేళ్ళలోపు వయసు కలిగిన వారు, డిగ్రీ పరీక్ష‌ ఉత్తీర్ణులైన, సంవత్సరానికి మూడులక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగిన అభ్యర్థులు ఈ ప్రవేశపరీక్షకై దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు.

కావాల్సిన పత్రాలు:

1) కులం సర్టిఫికెట్

2) ఒక సంవత్సరం నిండనటువంటి ఆదాయం సర్టిఫికెట్

3) డిగ్రీ సర్టిఫికెట్

4) వయసును తెలిపే పదో తరగతి సర్టిఫికెట్

5) ఆధార్ కార్డు

6) పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్

7) అంగవైకల్యం సర్టిఫికెట్ (వర్తించేవారికి మాత్రమే) లను సిద్ధం చేసుకుని స్టడీ సర్కిల్ వెబ్సైట్ http://.tsscstudycircle.co.in/ నందు అప్లై చేసుకోవాల్సిందిగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి తెలియజేశారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి

సంబంధిత కథనం