Telugu News  /  Telangana  /  Four People Died In Road Accident In Sangareddy District
సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం
సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం

Road Accident in Sangareddy: ఆర్టీసీ బస్సు - కారు ఢీ.. నలుగురు దుర్మరణం

03 November 2022, 9:47 ISTHT Telugu Desk
03 November 2022, 9:47 IST

Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్సాన్‌పల్లి వద్ద గురువారం ఉదయం ఘటనలో నలుగురు మృతి చెందారు.

Four People Died in Road Accident in Sangareddy: సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండల పరిధిలో చోటు చేసుకుంది. నాందేడ్ - అకొలా జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో కారులోని నలుగురు నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. బస్సులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్ లో ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ముగ్గురు మృతి…

వికారాబాద్ జిల్లాలోనూ ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ధారూర్ మండలం కేరెళ్లి శివారులో ఓ గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలు ఉన్న ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వికారాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. మృతులను వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మధనాంతపూర్ తండా, రేగొండిలకు చెందిన వారుగా గుర్తించారు.

Labourers Died In Anantapur : మరోవైపు బుధవారం ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గహొన్నూర్‌లో దారుణం జరిగింది. ఆంధ్రప్రదేశ్-కర్నాటక సరిహద్దుల్లో విషాదం జరిగింది. దర్గహొన్నూర్‌లో ట్రాక్టర్‌పై విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు మృతి చెందారు. పంట కోతల కోసం పని చేస్తుండగా మెయిన్‌ లైన్‌ తీగలు ట్రాక్టర్‌పై తెగిపడ్డాయి. ఈ కారణంగానే.. దుర్ఘటన జరిగినట్టుగా సమాచారం. మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు.

జూన్‌ నెలలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కూలీలు చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపంలో కూలి పనులకు ఆటోలో వెళ్తున్నారు. ఇదే సమయంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగి ఆటో మీద పడ్డాయి. ఆటో మొత్తం కాలిపోయింది. ఐదుగురు చనిపోయారు. ప్రమాద సమయంలో మొత్తం డ్రైవర్‌ తో కలిపి 13 మంది కూలీలు ఆటోలో ఉన్నారు. వీరిలో డ్రైవర్‌ పోతులయ్య, మరో ఏడుగురు కూలీలు బతికారు.