వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు..
పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన పలువురు ట్రావెల్స్ బస్సులో పరిగిలో జరిగిన పెళ్లి విందుకు హాజరయ్యారు.
స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా రోడ్డుపై నిలిపిన లారీని వీరి బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.వీరంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో బస్సు ముందు బాగం నుజ్జయింది. దీంతో బస్సులో ప్రయాణికులు చిక్కుకుపోయారు. మృతదేహాలను అతి కష్టం మీద స్థానికుల సాయంతో పోలీసులు వెలికి తీశారు.
మృతులను రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను ,బాలమ్మ ,(60)హేమలత (30) మల్లేష్ (26) సందీప్ (28) గా గుర్తించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం బీతావహంగా మారింది.
సంబంధిత కథనం