Warangal Road Accident : మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం - లారీలో నుంచి తెగిపడిన ఐరన్ రాడ్లు, 4 మంది మృతి
Road accident at Mamnoor : వరంగల్ శివారు ప్రాంతమైన మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీలో నుంచి ఐరన్ రాడ్లు తెగి పడిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై భారీ ఐరన్ మెటీరియల్ లోడ్ తో వెళ్తున్న లారీ తాడు తెగిపోవడంతో ఘటన జరిగింది. పక్కనే ఉన్న ఆటోలతో పాటు ఓ కారుపై ఐరన్ రాడ్లు పడిపోయాయి.

ఈ ఘోర ప్రమాదంలో ఓ ఆటో పూర్తిగా నజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న మామునూరు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి:
వరంగల్ లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.