KTR Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసు, కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు-రేపు విచారణకు రాలేనని ఈడీకి కేటీఆర్ రిప్లై-formula e race case acb send another notice to ktr reply to ed on enquiry ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసు, కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు-రేపు విచారణకు రాలేనని ఈడీకి కేటీఆర్ రిప్లై

KTR Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసు, కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు-రేపు విచారణకు రాలేనని ఈడీకి కేటీఆర్ రిప్లై

KTR Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కాలేనని ఈడీకి కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

ఫార్ములా ఈ-రేస్ కేసు, కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు-రేపు విచారణకు రాలేనని ఈడీకి కేటీఆర్ రిప్లై

KTR Race Case : ఫార్ములా ఈ-రేస్‌ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఓరియన్‌ విల్లాకు వెళ్లి కేటీఆర్‌కు నోటీసులు అందించారు ఏసీబీ అధికారులు.

ఫార్మూలా ఈ-రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే ఒకసారి ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో కేటీఆర్...ఇవాళ ఉదయం ఏసీబీ ఆఫీసుకు వచ్చారు. అయితే విచారణకు తన న్యాయవాదిని పోలీసులు అనుమతించకపోవడంతో కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు తన న్యాయవాది ఏసీబీ అధికారులకు వస్తే నష్టమేంటని ప్రశ్నించారు.

ఏసీబీ ఆఫీసు రోడ్డు వద్దే తన స్పందనను రాతపూర్వకంగా అధికారులకు అందించారు కేటీఆర్. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజ్వరు చేసింది. హైకోర్టు తీర్పు తర్వాతే తాను చట్టప్రకారం ముందుకెళ్లాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. దీంతో ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తరుణంలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. ఈ నెల 9న జరిగే విచారణకు కేటీఆర్ న్యాయవాదిని అనుమతిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసుపై హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది.

ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కేటీఆర్ హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వులో ఉందని, హైకోర్టు పైన ఉన్న గౌరవంతో.. తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కోరారు కేటీఆర్. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ తన సమాధానం పంపారు.

కేటీఆర్ ఇంటిపై రెయిడ్ చేసేందుకు కుట్ర

ఫార్ములా-ఈ కార్ కేసులో కేటీఆర్‌ను ఏసీబీకి విచారణకు పిలిచింది. విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ దగ్గరకు వెళ్లారు. కానీ.. తన లాయర్‌ను అనుమతించకపోవడంతో.. వెనక్కి వెళ్లారు. ఈ అంశంపై ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

'సీఎం రేవంత్‌ అన్ని అంశాల్లోనూ బోర్లా పడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కేటీఆర్‌పై కేసు పెట్టారు. కేటీఆర్ ఇంటిపై రెయిడ్ చేసేందుకు కుట్ర చేశారు. బాధ్యత ఉన్న నేతగా కేటీఆర్ విచారణకు వెళ్లారు. లాయర్‌తో విచారణకు హాజరైతే ఏసీబీకి అభ్యంతరమేంటి. పట్నం నరేందర్‌రెడ్డి కేసులో వ్యవహరించినట్టుగానే.. కేటీఆర్ విషయంలోనూ చేయాలని కుట్ర చేశారు' అని జగదీష్‌ రెడ్డి ఆరోపించారు.

సంబంధిత కథనం