Ponguleti Political Journey: మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ వ్యూహకర్తల మంతనాలు-former mp ponguleti srinivasa reddy s political journey towards congress party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Former Mp Ponguleti Srinivasa Reddy's Political Journey Towards Congress Party

Ponguleti Political Journey: మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ వ్యూహకర్తల మంతనాలు

HT Telugu Desk HT Telugu
Apr 18, 2023 04:37 PM IST

Ponguleti Political Journey: ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు పయనిస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందంతో పొంగులేటి సుదీర్ఘ మంతనాలు సాగించారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Political Journey: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బిఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పొంగులేటి దూకుడు పెంచారు. రాజకీయంగా పొంగులేటి రాజకీయ ప్రయాణం ఎటు వైపనే దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

బిఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత బీజేపీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీతో బీజేపీ అగ్రనేత అమిత్ షా సైతం మాట్లాడినట్లు కథనాలు వెలువడ్డాయి. తాజాగా పొంగులేటి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరనున్నారని కథనాలు వెలువడ్డాయి.

ఏఐసిసి టాస్క్‌ ఫోర్స్‌లో పార్టీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు నేతృత్వంలోని సభ్యులు, ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయనే దానిపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి పొంగులేటి కాంగ్రెస్‌లో చేరే విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోయినా, త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

మరోవైపు ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తన అనుచరులకు ఏ మేరకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు దక్కుతాయనే దానిపై భరోసా కోరినట్లు తెలుస్తోంది. తన అనుచరుల్లో కీలకమైన వారికి పది అసెంబ్లీ సీట్లు కేటాయించాలని పొంగులేటి కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. పొంగులేటి డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్ానయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర అసెంబ్లీ మినహా మిగిలిన స్థానాల్లో పొంగులేటి డిమాండ్లను పరిశీలిస్తామని కాంగ్రెస్‌ తరపున చర్చలకు వచ్చిన దూతలు పొంగులేటికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజారాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ ఏడాది జనవరి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన మద్దతు దారులతో పొంగులేటి ఆత్మీయ సదస్సులు నిర్వహించారు. తాజాగా మాజీ మంత్రి జూపల్లిని ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించారు. దీంతో, పొంగులేటి తో పాటుగా జూపల్లిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. తాజాగా పొంగులేటికి కాంగ్రెస్ ను భారీ ఆఫర్ వచ్చింది. రాహుల్ గాంధీ తరపున సునీల్‌ కనుగోలు బృందం పొంగులేటితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రావడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. పొంగులేటి జిల్లాలో ఆర్దికంగా.. సామాజకంగానే కాకుండా ప్రతీ నియోజక వర్గంలో తనకంటూ మద్దతు ఉన్న నేత కావటంతో రాహుల్ బృందం నేరుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జిల్లాలో సీనియర్లు ఉండటంతో..పార్టీలో చేరితే సముచిత ప్రాధాన్యత ఇస్తామని మాత్రమే హామీ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఖమ్మం జిల్లా సీనియర్లు పొంగులేటి చేస్తున్న డిమాండ్లకు .. పార్టీ నాయకత్వం సానుకూలంగా స్పందించటంపై అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి 2014లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు. అయితే రాష్ట్ర విభజనానంతర పరిణామాల నేపథ్యంలో ఆయన అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో పొంగులేటికి టిక్కెట్ దక్కలేదు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వర రావును బరిలోకి దింపింది. అయినా పొంగులేటితో పాటు ఆయన అనుచరగణం మొత్తం బీఆర్ఎస్ కోసం పనిచేశారు. ఎన్నికల తర్వాత పొంగులేటి వర్గాన్ని కేసీఆర్ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. నాలుగేళ్లయినా కూడా తనకు కానీ, తన వర్గానికి కూడా ఒక్క పదవి కూడా ఇవ్వలేదనే పొంగులేటి రగిలిపోయారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పొంగులేటి భావించారు.

ఇటీవల బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంతోఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సన సమయం ఆసన్నమైందని పొంగులేటి శ్రీనివాస రెడ్డి భావిస్తున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ రోజే ఢిల్లీలో అమిత్ షాను కలిసి బీజేపీలో చేరుతారని వార్తలు వినిపించాయి. బీజేపీలో చేరికపై పొంగులేటి ఎప్పుడూ బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ కూడా ఎప్పుడు పొంగులేటి తమ పార్టీలో చేరడం ఖాయమని ప్రకటించలేదు. పొంగులేటి కోసం బీజేపీ ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే కాంగ్రెస్‌ తెరపైకి వచ్చింది.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. బీజేపీ కంటే కాంగ్రెస్ లో చేరితేనే పొంగులేటికి నేతలకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందని ఆయన అనుచరులు సూచించినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరిన నేతల పరిస్థితులను వాళ్లు ఉదాహరణగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో నేరుగా హైకమాండ్ తో మాట్లాడే అవకాశం ఉంటుందని, వేరే ఏ పార్టీలో చేరినా ఒకరి కింద పనిచేయాల్సి ఉంటుందని పొంగులేటి భావిస్తున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని అనుచరులు చెబుతున్నారు. మేలో భద్రాచలం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈలోపే పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. హ్వానించారు.

WhatsApp channel