RS Praveen Kumar : మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం-former ips officer rs praveen kumar house burglarized in sirpur kagaznagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rs Praveen Kumar : మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం

RS Praveen Kumar : మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం

Basani Shiva Kumar HT Telugu
Oct 31, 2024 02:53 PM IST

RS Praveen Kumar : మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో విలువైన పత్రాలను దోచుకెళ్లారని ఆర్ ప్రవీణ్ ఆరోపించారు. ఇందులో ఏదో కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ చోరీపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్ ప్రవీణ్ కుమార్
ఆర్ ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని తన ఇంట్లో చోరీ జరిగినట్టు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ప్రవీణ్ ఇంట్లో బుధవారం అర్థరాత్రి దొంగలు చొరబడ్డారు. సిర్పూర్ కాఘజ్‌నగర్‌లోని కోసిని గ్రామంలో ఈ చోరీ జరిగింది. విలువైన పత్రాలు చోరీకి గురైనట్లు ప్రవీణ్ తెలిపారు.

'తెలంగాణ లో దోపిడి దొంగల పాలన నడుస్తున్నది. ఇది ముమ్మాటికీ నిజం. సిర్పూర్ కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహంలో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీని కోరుతున్న' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

ఇటీవల భట్టి ఇంట్లో..

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్‌కి చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. నిందితుల నుంచి రూ.2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

మోహన్ బాబు ఇంట్లో..

హీరో మోహన్ బాబు ఇంట్లో పని చేసే వ్యక్తి షాక్ ఇచ్చాడు. ఆయన ఇంట్లోనే దొంగతనం చేశాడు. నాయక్ అనే వ్యక్తి గత కొంత కాలంగా హైదరాబాద్ శివారులో జల్‌పల్లిలో మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్నాడు. ఇటీవల రాత్రిపూట దాదాపు రూ.10 లక్షల నగదుతో ఉడాయించాడు. ఇది గమనించిన మోహన్ బాబు.. వెంటనే రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. 10 గంటల్లోనే నిందితుడిని తిరుపతిలో అరెస్టు చేశారు. ఇలా వరుసగా వీఐపీల ఇళ్లలో చోరీలు జరగడం సంచలనంగా మారింది.

Whats_app_banner