Adilabad Tiger: నిర్మల్ అటవీ సరిహద్దు ప్రాంతంలో పెద్ద పులి ఆనవాళ్లు గుర్తింపు... పులి సంచారం నిజమేనంటున్న అటవీ శాఖ
Adilabad Tiger: నిర్మల్ అటవీ సరిహద్దు ప్రాంతంలో పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పులి సంచారం నిజమేనని అటవీ శాఖ అధికారులు ధృవీకరించడంతో స్థానిక ప్రజలు హడలెత్తిపోతున్నారు. పులి సంచరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Adilabad Tiger: అటవీ ప్రాంతంలో గత మూడు రోజుల గాలిoపునకు తెరపడింది. ఆదివారం పులి సంచారం ఆనవాళ్లను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. బోధ్-నిర్మల్ అటవీ సరిహద్దు ప్రాంత సహ్యాద్రి కొండల్లో పులి సంచరిస్తున్నట్లు సారంగాపూర్ ఉప అటవీ అధికారి మహ్మద్ నజీరాఖాన్ తెలిపారు.
ఎస్ఆర్వో రామకృష్ణ, టాస్క్ఫోర్స్ ఎస్ఆర్వో వేణుగోపాల్ పర్యవేక్షణలో బృందాలు సహ్యాద్రి అటవీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సారంగాపూర్ మండలం అడెల్లితండా సమీపంలోని అడవిలో పులి సంచరించినట్లు పాద ముద్రలను గుర్తించారు.
పూర్తిగా అడవిలోనే పులి సంచరిస్తున్నందున ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు. ఇదే సమయంలో అకారణంగా ఒంటరిగా అడవిలోకి ఎవరూ వెళ్లొద్దన్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ ప్రాంతంలో పులి సంచరించిన విషయం తెలిసిందే.
కొన్ని రోజుల క్రితం అక్కడి నుంచి బోథ్ మండలంలోని కైలాస్గకిడి ప్రాంతానికి వచ్చినట్లు అక్కడి అటవీ అధికారులు తెలిపారని డిప్యూటీ ఆర్వో చెప్పారు. అయితే ఇక్కడ లభించిన ఆనవాళ్లు అదే పులివి అయి ఉండొ చ్చని భావిస్తున్నారు. కాగా మూడు రోజులుగా అధికారులు రవీంద్రనగర్, అడెల్లితండా,
కర్జీ శివారుల్లో పలు పశువులు, జీవాలపై దాడిచేసింది పులి కాకపోవచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. దాడి పూర్వాపరాలు, ఆనవాళ్లను పరిశీలిస్తే అది చిరుతపులి అయి ఉండవచ్చని అన్నారు.
గ్రామాల సమీపంలో ముద్ర దాడులు చేస్తున్నది చిరుత, బోథ్-నిర్మల్ అటవీ సరిహద్దులో సంచరిస్తు న్నది పెద్దపులి అని అటవీశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దు....
మండలంలోని గుడి పేట, నంనూరు, ధర్మారం గ్రామాల శివారులోని అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. రెండు రోజుల క్రితం ధర్మారం ప్రాంతంలో పులి అడుగుల గుర్తులను గుర్తించామని, రోజుకో ప్రాంతానికి సంచరించే అవకాశం ఉన్నందున ముందస్తుగా గ్రామస్థు లను హెచ్చరిస్తూ ప్రజలకు తెలిసేలా గ్రామాల్లో చాటింపు వేయాలని బీట్ అధికారి రాజేందర్ తెలిపారు. గొర్రెలు, పశువుల కాప రులు, ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
పులి రక్షణలో అటవీ అధికారులు...
గత మూడు రోజులుగా పెద్దపులి సంచార వార్తలు బయటకు రావటం తో అటవీ శాఖ అధికారులు అప్రతమయ్యారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అడెల్లి పోచమ్మ ఆలయ సమీపంలోని పలుతాండలలో పెద్దపులి సంచార వార్త బయటకు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఇదిలా ఉండగా వేటగాళ్లు ఉచ్చులకు కరెంటు తీగలకు బలికాకుండా ఉండేందుకు అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. సమీపంలోని పంట పొలాలలో విద్యుత్ తీగల అమరికలను తీసివేయిస్తున్నారు. పులి ప్రమాద బారిన పడకుండా అటవీ లోపల ప్రాంతంలోకి వెళ్లేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.
నిరంతరం సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు, కంపార్ట్మెంట్ నెంబర్ 1023 లో పులి తిరిగిన పాదముద్రలు సేకరించి పులి కదలిక పైన పర్యవేక్షస్తూ రక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిరోజులు తాండవాసులు అటవీ సమీపంలో అడవుల్లోకి వెళ్ళకూడదని గ్రామస్తులను ఆదేశించారు.
పులి సంచరించిన ప్రాంతములో చీఫ్ కన్జర్వేటర్ పర్యటన
గత మూడు రోజులుగా పులి సంచారం అనే వార్తలు బయటకు రావడంతో బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సి. శరవనన్ సోమవారం ఆయ ప్రాంతాల్లో పర్యవేక్షించారు. కిందిస్థాయి సిబ్బంది డి ఎఫ్ ఓ, ఎఫ్ ఆర్వో, లను పులి రక్షణ తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అప్రమత్తం చేసి అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది సేకరించిన పాదముద్రలను, తదిత రికార్డులను ఆనవాళ్లను పరిశీలించారు. అటవీ ప్రాంతంలో ఒంటరిగా ఎవరు వెళ్లకూడదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.