Food Poisoning: కరీంనగర్ లో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్... 31 మంది విద్యార్థులు అస్వస్థత, విద్యార్ధి సంఘాల ఆందోళన-food poisoning at gurukul school in karimnagar 31 students fall ill student associations concerned ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Food Poisoning: కరీంనగర్ లో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్... 31 మంది విద్యార్థులు అస్వస్థత, విద్యార్ధి సంఘాల ఆందోళన

Food Poisoning: కరీంనగర్ లో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్... 31 మంది విద్యార్థులు అస్వస్థత, విద్యార్ధి సంఘాల ఆందోళన

HT Telugu Desk HT Telugu
Jan 08, 2025 05:03 AM IST

Food Poisoning: కరీంనగర్ లో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు నిరసనకు వ్యక్తం చేశాయి. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న వరుస ఘటనలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

కరీంనగర్‌ గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజనింగ్‌, విద్యార్థులకు అస్వస్థత
కరీంనగర్‌ గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజనింగ్‌, విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning:: తెలంగాణలో డైట్ చార్జీలు పెంచి గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టళ్ళలో మెనూ మార్చినప్పటికీ పరిస్థితి మారడం లేదు. నాణ్యమైన భోజనం అందక కరీంనగర్ లో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.‌ విద్యార్థుల అస్వస్థతతో పేరెంట్స్, విద్యార్థి సంఘాలలను ఆందోళనకు గురిచేసింది. అధికారులను, పాలకులను పరుగులు పెట్టించింది.

yearly horoscope entry point

కరీంనగర్ లోని శర్మనగర్ లో గల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో సోమవారం రాత్రి కాలిఫ్లవర్ కర్రీ తో భోజనం పెట్టారు.‌ భోజనం తిన్న 31 మంది విద్యార్థులు కడుపునొప్పి వాంతులతో అస్వస్థత గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించగా అందరూ కోలుకున్నారు. కానీ విద్యార్థుల అస్వస్థత సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. ఆసుపత్రి వద్ద గురుకుల పాఠశాల వద్ద పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఆందోళనలతో ఉద్రిక్తత ఏర్పడి అధికారులు పోలీసులు హైరానా పడ్డారు.‌

ఫుడ్ పాయిజన్ కాదని స్పష్టం చేసిన వైద్యులు

నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతోనే ఫుడ్ పాయిజన్ తో విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారని పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ కు మాత్రం కాకపోవచ్చని తెలిపారు. 430 మంది ఉన్న గురుకులంలో 31 మంది అస్వస్థకు గురికావడం ఫుడ్ పాయిజన్ కాదన్నారు. వివిధ కారణాలతో విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని స్పష్టం చేశారు.

విద్యార్థి సంఘాలు ఎబివిపి, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన డైట్ మెనూ ప్రకారం బోజనం పెట్టకపోవడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు.‌ గొప్పగా ప్రభుత్వం చెప్పినా, క్షేత్రస్థాయిలో డైట్ మెనూ అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల అస్వస్థతపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గురుకులంను సందర్శించి అడిషనల్ కలెక్టర్, ఆర్సీఎం...

విద్యార్థుల అస్వస్థతపై డిల్లీలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. కలెక్టర్ పమేలా సత్పతికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించి హాస్టల్ పరిస్థితిని మెరుగుపరచాలని సూచించారు. ప్రస్తుతం విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్ తెలిపారు.

గురుకులాలు, హాస్టళ్లలో భోజనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. శుభ్రత, నాణ్యత విషయంలో రాజీపడొద్దని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, బిసి సంక్షేమ హాస్టల్ రీజనల్ కోఆర్డినేటర్ అంజలి గురుకుల పాఠశాలను సందర్శించి పరిశీలించారు. కాలీఫ్లవర్ కర్రీ, శనగలు తిన్న విద్యార్థులు అస్వస్థకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. ఫుడ్ పాయిజన్ పై విచారణ జరిపి బాద్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్సీఎం అంజలి తెలిపారు. ప్రిన్సిపల్ వేణుగోపాల్, వార్డెన్ ఉమాదేవిని సస్పెండ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

విద్యార్థులకు పరామార్శ వెల్లువ...

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శలు వెల్లువెత్తాయి. హాస్పిటల్, గురుకుల పాఠశాలను సందర్శించే వారితో సందడిగా మారి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.‌ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విద్యార్థులను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్డీఓ మహేశ్వర్ పరామర్శించారు. అస్వస్థత గల కారణాలు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి తెలిపారు.

ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత గురయ్యారా లేకుంటే మరేదైనా కారణం ఉందా అనేది విషయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టేలా చూస్తామన్నారు. మొత్తానికి విద్యార్థుల అస్వస్థత అటు అధికారులను, ఇటు పాలకులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner