నిర్మల్ జిల్లాలోని బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా హైదరాబాద్ నగరానికి చెందిన వారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.