ఎఫిడ్రిన్ కలిపిన కొకైన్ విక్రయిస్తున్న ఐదుగురి అరెస్టు.. ప్రధాన నిందితుడు పోలీసు కానిస్టేబుల్-five held in hyderabad for trying to sell cocaine mixed with ephedrine ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఎఫిడ్రిన్ కలిపిన కొకైన్ విక్రయిస్తున్న ఐదుగురి అరెస్టు.. ప్రధాన నిందితుడు పోలీసు కానిస్టేబుల్

ఎఫిడ్రిన్ కలిపిన కొకైన్ విక్రయిస్తున్న ఐదుగురి అరెస్టు.. ప్రధాన నిందితుడు పోలీసు కానిస్టేబుల్

HT Telugu Desk HT Telugu

హైదరాబాద్‌లో ఎఫిడ్రిన్ కలిపిన కొకైన్ విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు తిరుపతికి చెందిన ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ అని పోలీసులు తెలిపారు.

డ్రగ్స్ విక్రేతల అరెస్టు (HT_PRINT)

హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఎఫిడ్రిన్ కలిపిన కొకైన్ ను విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నెల 2న కొనుగోలుదారుల కోసం గాలిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. కోటి విలువైన 820 గ్రాముల మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు.

ప్రధాన నిందితుడు, నిషేధిత మాదకద్రవ్యాల సరఫరాదారు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు.

లాభాల కోసం ఎఫెడ్రిన్ ను విక్రయించాలని పోలీసు కానిస్టేబుల్ ప్రతిపాదించినట్లు విచారణలో వెల్లడైందని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రొసీజర్స్ ప్రకారం సీజ్ చేసినట్లు తెలిపింది.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.