ఇవాళ, రేపు హైదరాబాద్ లో 'చేప ప్రసాదం' పంపిణీ - ముఖ్యమైన 8 విషయాలు-fish prasadam will be distributed today and tomorrow at the nampally exhibition grounds in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇవాళ, రేపు హైదరాబాద్ లో 'చేప ప్రసాదం' పంపిణీ - ముఖ్యమైన 8 విషయాలు

ఇవాళ, రేపు హైదరాబాద్ లో 'చేప ప్రసాదం' పంపిణీ - ముఖ్యమైన 8 విషయాలు

హైదరాబాద్ లో ఇవాళ, రేపు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రతి ఏడాది బత్తిని సోదరులు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ఆస్తమా, శ్వాసకోశ సమస్యల నుంచి చేప ప్రసాదంతో ఉపశమనం కలిగుతుందని ప్రజల నమ్ముతుంటారు.

చేప ప్రసాదం పంపిణీ

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇవాళ, రేపు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లను చేసింది. ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిన సోదరులు ప్రతి ఏడాది ఏటా ఉచితంగా ఈ ప్రసదాన్ని పంపిణీ చేస్తుంటారు.

ప్రతి ఏడాది పంపిణీ…

మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ సారి పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే చాలా మంది తరలివచ్చారు. ఈ సంఖ్యలో పెద్ద ఎత్తులో ఉంటుంది. ఈ ఏడాది దాదాపు 40కి పైగా క్యూలైన్లను ఏర్పాట్లు చేశారు.

భారీ ఏర్పాట్లు - ముఖ్యమైన అంశాలు:

  1. చేప ప్రసాదం కోసం ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌,కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆయా రాష్ట్రాల నుంచి ఇప్పటికే చాలా మంది నగరానిక చేరుకున్నారు. వీరంతా కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్తున్నారు.
  2. లక్షలాది మంది తరలివస్తుండటంతో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం సూచించారు.
  3. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఉన్నాయి.
  4. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల కోసం తాగునీటి సౌకర్యాలు, టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.
  5. హెల్త్ క్యాంపులు, అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం వేసే వాలంటీర్లకు సీపీఆర్ శిక్షణ కూడా ఇచ్చారు.
  6. చేప ప్రసాదం పంపిణీకి వచ్చే వారి కోసం ఆర్టీసీ 140 ప్రత్యేక బస్సులు నడుపుతుందని గ్రేటర్‌ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
  7. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకోవడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ, చర్లపల్లి నుండి ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
  8. చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తెలిపారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.