దుండిగల్ లో విషాదం - ఒకటో తరగతి బాలుడి పైనుంచి వెళ్లిన టిప్పర్‌, స్పాట్ లోనే మృతి-first grade student dies in road accident at dundigal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  దుండిగల్ లో విషాదం - ఒకటో తరగతి బాలుడి పైనుంచి వెళ్లిన టిప్పర్‌, స్పాట్ లోనే మృతి

దుండిగల్ లో విషాదం - ఒకటో తరగతి బాలుడి పైనుంచి వెళ్లిన టిప్పర్‌, స్పాట్ లోనే మృతి

మేడ్చల్‌ జిల్లాలోని దుండిగల్‌ పరిధిలోని మల్లంపేట్‌లో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో…ఒకటో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

మేడ్చల్‌ జిల్లాలోని దుండిగల్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లంపేట్‌ రోడ్డుపై ఓ తల్లి తన ఆరేళ్ల కుమారుడిని (ఒకటో తరగతి) స్కూటీపై స్కూల్ కు తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే వీరి వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఇంతలోనే బాలుడు ఎగిరి టిప్పర్ టైర్ కింద పడి నుజ్జునుజ్జు అయ్యాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తల్లికి స్వల్ప గాయాలు కాగా…. విగతజీవిగా పడి ఉన్నకొడుకును చూసి తల్లడిల్లిపోయింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.