Hyderabad Metro : మలక్‌పేట్ మెట్రోస్టేషన్ కింది అగ్నిప్రమాదం.. రాకపోకలకు అంతరాయం
Hyderabad Metro : హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఈసారి మెట్రో స్టేషన్ కింద ప్రమాదం జరగడంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైక్‌లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు అంటుకొని ప్రమాదం జరిగింది.
హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మెట్రోస్టేషన్ కింది అగ్నిప్రమాదం జరిగింది. పార్క్ చేసిన బైక్‌లో చెలరేగిన మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి పక్కనే ఉన్న 5 బైక్‌లు దగ్ధం అయ్యాయి. మలక్‌పేట్ మెట్రోస్టేషన్ కింద దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు భయాందోళన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం కారణంగా.. మలక్‌పేట- దిల్‌సుఖ్‌నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఎర్పడింది.
ఇలా జరిగింది..
మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన ఒక బైక్ నుంచి మంటలు వచ్చాయని, ఆ మంటలు దగ్గర్లోని వాహనాలకు కూడా అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. అగ్ని మాపక సిబ్బందికి వాహనదారులు సమాచారం ఇవ్వగా.. ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ అగ్నిప్రమాదం మెట్రో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. మెట్రో ప్రయాణికులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. కొద్దిసేపు మెట్రో స్టేషన్ లోకి వచ్చే వాళ్లు, వెళ్లే వాళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. అటు మెట్రో స్టేషన్లో పనిచేసే ఉద్యోగులు కూడా భయాందోళన చెందారు. మలక్ పేట్ మెట్రో పిల్లర్ నెంబర్ 1409 వద్ద ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
సాంకేతిక సమస్య..
నవంబర్ 4వ తేదీన హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఎల్‌బీ నగర్- మియాపూర్ మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య కారణంగా రైళ్లు నెమ్మదిగా వెళ్లాయి. విద్యుత్ ఫీడర్ ఛానల్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని మెట్రో అధికారులు తెలిపారు. రైళ్లు ఆలస్యం కావడంతో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, మియాపూర్ స్టేషన్లలో అప్పుడు రద్దీ నెలకొంది.
సాంకేతిక సమస్య కారణంగా బ్లూ లైన్‌లో కొద్దిసేపు ఆలస్యమైందని.. హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నామని ట్వీట్ చేసింది. మీ సహకారానికి ధన్యవాదాలు అని.. అసౌకర్యానికి చింతిస్తున్నామమని పేర్కొంది.