Telangana Budget 2024-25 : రూ. 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ - లెక్కలు ఇవే-finance minister bhatti introduced the telangana vote on account budget 2024 in assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Budget 2024-25 : రూ. 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ - లెక్కలు ఇవే

Telangana Budget 2024-25 : రూ. 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ - లెక్కలు ఇవే

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 10, 2024 01:08 PM IST

Telangana Vote On Account Budget 2024 -2025 : తెలంగాణ ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలోప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి… తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను తీసుకువచ్చినట్లు వివరించారు.

తెలంగాణ బడ్జెట్ 2024
తెలంగాణ బడ్జెట్ 2024

Telangana Budget 2024 -2025 Updates: రాష్ట్ర శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క… మధ్యాహ్నం 12 తర్వాత పద్దును సభ ముందు ఉంచారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన భట్టి…. సమాన్వతమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గుణాత్మక మార్పు తీసుకురావటమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎలాంటి త్యాగాలకైనా సర్కార్ సిద్ధంగా ఉంటుందని… ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు.

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందన్నారు భట్టి విక్రమార్క. కానీ తమ ప్రభుత్వం అలా కాకుండా… వాస్తవాలను ప్రతిబింబించేలా రూపొందించామని స్పష్టం చేశారు. దళితబంధుకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు కానీ… ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలు పథకాల వివరాలను సభ ముందు ఉంచారు భట్టి విక్రమార్క. రూ.2,75,891 కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేటాయింపుల వివరాలను వివరించారు.

తెలంగాణ బడ్జెట్ 2024- 2025:

రూ.2,75,891 కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2024- 2025).

రెవెన్యూ వ్యయం -2,01,178 కోట్లు.

మూల ధన వ్యయం - 29,669 కోట్లు.

ఆరు గ్యారెంటీల కోసం - రూ.53,196 కోట్లు అంచనా.

మూసీ ప్రాజెక్టుకు - రూ. 1000 కోట్లు కేటాయింపు.

పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు.

ఐటీ శాఖకు రూ.774 కోట్లు.

పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు.

పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు కేటాయింపు.

వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు.

ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు కేటాయింపు.

ఎస్సీ సంక్షేమం రూ. 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.13,013, రూ. మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు కేటాయింపు.

బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు.

బీసీ సంక్షేమం రూ8 వేల కోట్లు కేటాయింపు.

విద్యా రంగానికి రూ.21,389 కోట్లు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు.

యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయింపు.

వైద్య రంగానికి రూ.11,500 కోట్లు.

విద్యుత్ గృహ జ్యోతికి రూ.2,418 కోట్లు. విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు కేటాయంపు.

గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి ప్రకటించారు.

రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ.. విధివిధానాలు ఖరారు చేయబోతున్నట్లు ప్రకటన.

రైతుబంధు నిబంధనలు మార్చి… రైతుభరోసా కింద ఎకరానికి రూ. 15 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామని భట్టి తెలిపారు.

Whats_app_banner