Teenage love: ఇంటర్ విద్యార్ధిని ప్రేమ వ్యవహారం, ప్రియుడి గొంతు కోసిన తండ్రి.. భయంతో ఆత్మహత్య చేసుకున్న కూతురు
Teenage love: టీనేజీ ప్రేమ వరంగల్‌లో విషాదంతంగా మారింది. కూతురితో ఓ యువకుడు సన్నిహితంగా ఉండటం చూసి చేయి చేసుకున్న తండ్రి అంతటితో ఆగకుండా అతని గొంతు కోశాడు. అది చూసి ఆందోళనకు గురైన బాలిక ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హన్మకొండలో కలకలం రేపింది.
Teenage love: ఇంటర్ చదువుతున్న బాలిక ప్రేమ వ్యవహారం విషాదంతంగా మారింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో స్నేహితుడిని ఇంటికి పిలిచింది. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంటికి తండ్రి రావడం.. ఇంట్లో సన్నిహితంగా ఉన్న వారిని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. కుమార్తెతో సన్నిహితంగా ఉన్న బాలుడిని కొట్టి అతని గొంతు కోశాడు. దీంతో ఆందోళనకు గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

హనుమకొండలో మంగళవారం సాయంత్రం జరిగిన ఘటనలో ఓ బాలిక ప్రాణాలు బలితీసుకుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నేహితుడిని ఇంటికి పిలిచింది. అదే సమయంలో ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన తండ్రి బాలుడిని చూసి ఆగ్రహానికి గురయ్యాడు. అతనిపై దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. ఇది చూసి ఆందోళనకు గురైన బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
హనుమకొండ నగర శివారు ప్రాంతానికి చెందిన బాలిక ఇంటర్ సెకండియర్ చదువు తోంది. వరంగల్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నేహితుడిని ఇంటికి పిలిచింది.
హన్మకొండలో ప్రైవేటు ఉద్యోగం చేసే బాలిక తండ్రి సాయంత్రం విధులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక ఇంట్లో మరో బాలుడితో కుమార్తె సన్నిహితంగా ఉండటం చూసి కోపంతో బాలుడిపై చేయి చేసుకున్నాడు. అతడిని బంధించి ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కోశాడు. బాధితుడు భయంతో కాపాడాలని అరుస్తూ బయటకు వచ్చాడు. అతని వెనుకే బాలిక తండ్రి కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు.
బాలుడి పీక కోయడం, గొడవ జరగడంతో ఆందోళనకు గురైన బాలిక ఇంట్లోనే గడి ట్టుకొని ఉరి వేసుకుంది. స్థానికుల సాయంతో తండ్రి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లేసరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో బాలిక తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. స్థానికులు స్వల్ప గాయాలైన బాలుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేయూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.