Nampally Fire Accident: నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం-fatal fire in nampally six people trapped in the building died ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Fatal Fire In Nampally, Six People Trapped In The Building Died

Nampally Fire Accident: నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

Sarath chandra.B HT Telugu
Nov 13, 2023 10:49 AM IST

Nampally Fire Accident: హైదరాబాద్‌ నాంపల్లి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సెల్లార్‌లో చెలరేగిన మంటలు భవనం మొత్తం వ్యాపించడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16మందిని భవనం నుంచి వెలుపలికి తీసుకువచ్చారు.

హైదరాబాద్‌ నాంపల్లిలో ఘోర ప్రమాదం
హైదరాబాద్‌ నాంపల్లిలో ఘోర ప్రమాదం

Nampally Fire Accident: హైదరాబాాద్‌ నాంపల్లి బజార్‌ఘాట్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌ ‌లో మంటలు చెల రేగడంతో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. భవనం కింది భాగంలో విగ్రహాల తయారీలో వినియోగించే కెమికల్స్‌ నిల్వ చేయడంతో మంటలు ఎగిసి పడ్డాయి. క్షణాల్లో భవనం మొత్తం మంటల్లో చిక్కుకుపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఉదయం 9.30కు భవనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. బజార్‌ఘాట్‌లో ఉన్న ఐదంతస్తుల భవనంలో 15కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అదే భవనం కింద భాగంలో కెమికల్స్‌, డీజిల్ ఆయిల్, వాహనాల్లో వినియోగించిన పాత ఆయిల్స్‌ నిల్వ ఉంచారు. షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా భవనంలోకి వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అందులో నివాసం ఉంటున్న వారిని అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.

ఆ సమయంలో నిద్రలో ఉన్న వారు పొగలో చిక్కుకు పోయారు. నిద్రలో ఉన్న వారు ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆరు ద్విచక్రవాహనాలు, ఓ కారు కూడా తగులబడ్డాయి. ఐదు ఫైరింజన్లతో మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేసినా అప్పటికే భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ వెంటనే భవనం లోపలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. డీజిల్‌ పొగలు వ్యాపించడంతో లోపల ఉన్న వారు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది.

భవనం వెలుపల టపాకాయలు కాలుస్తుండగా నిప్పు రవ్వలు చెలరేగి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వేగంగా మంటలు వ్యాపించడంతో షార్ట్‌ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ సిబ్బంది చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత ల్యాడర్ల సాయంతో 16మందిని కాపాడారు. ప్రమాదంలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయినట్టు ధృవీకరించారు. మృతులను ఉస్మానియా మార్చురీకి తరలించారు.

భవనం దిగువ గ్యారేజ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఉదయం కారును రిపేర్‌ చేస్తుండగా అందులో స్పార్క్‌ రావడంతో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. భవనం పై భాగంలో 15 కుటుంబాలు అద్దెకు ఉంటున్నట్లు సెంట్రల్ జోన్‌ డీసీపీ తెలిపారు. ట్యాంకుల్లో డీజిల్‌ నిల్వ ఉంచారని మంటలు వ్యాపించాయని తెలిపారు. మృతుల్లో నలుగరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని తెలిపారు.

వాహనాల నుంచి తొలగించిన ఇంజిన్ ఆయిల్స్‌ను అక్రమంగా నిల్వ చేయడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. భవన యజమానిని విచారిస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. భవనంలో 70మందికి పైగా నివాసం ఉంటున్నారు. రసాయినాలను నిల్వ ఉంచడానికి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు. అనధికారికంగా పెద్ద ఎత్తున రసాయినాలను నిల్వ చేయడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఫైర్ డీజీ

బజార్‌ఘాట్‌లో ప్రమాద స్థలాన్ని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి పరిశీలించారు. అనుమతులు లేని గోడౌన్‌తో ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ప్రమాద కారణాలను సాంకేతిక విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దట్టమైన పొగలు వ్యాపించడంతోనే ఊపిరి ఆడక బయటకు రాలేకపోయారని చెప్పారు. ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించడంతోనే ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని చెప్పారు.

భవన యజమాని రమేష్‌ జైస్వాల్‌ రసాయిన పరిశ్రమల్ని నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. వివిధ రకాల రసాయినాలను అక్రమంగా సెల్లార్‌లో నిల్వ చేయడంతో ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్‌ తయారీకి వినియోగించే కెమికల్స్‌తో పాటు మంటలు త్వరగా వ్యాపించే లక్షణాలున్న కెమికల్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నివాసాల మధ్య నిల్వ చేశారు. ఇదే ప్రమాదానికి కారణమైందని ఫైర్ అధికారులు చెప్పారు.

WhatsApp channel