Cellar Collapse: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం, సెల్లార్‌ తవ్వకంలో విషాదం.. ముగ్గురు కార్మికుల మృతి-fatal accident in hyderabad tragedy in cellar excavation three dead ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cellar Collapse: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం, సెల్లార్‌ తవ్వకంలో విషాదం.. ముగ్గురు కార్మికుల మృతి

Cellar Collapse: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం, సెల్లార్‌ తవ్వకంలో విషాదం.. ముగ్గురు కార్మికుల మృతి

Bolleddu Sarath Chandra HT Telugu
Feb 05, 2025 11:31 AM IST

Cellar Collapse: హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెల్లార్‌ నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా మట్టి పెళ్లలు విరిగి పడటంతో కూలీలు సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

ఎల్‌బి నగర్‌లో సెల్లార్‌ తవ్వకాల్లో విషాదం, మట్టిపెళ్లలు పడి ముగ్గురి మృతి
ఎల్‌బి నగర్‌లో సెల్లార్‌ తవ్వకాల్లో విషాదం, మట్టిపెళ్లలు పడి ముగ్గురి మృతి

Cellar Collapse: హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెల్లార్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడి వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో సూర్యాపేట, బీహార్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల్ని కాపాడేందుకు ఫైర్‌ సిబ్బంది, పోలీసులు , డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రయత్నించారు. సెల్లార్‌ కోసం తీసిన గుంతలు లోతుగా ఉండటంతో కార్మికులు పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పిల్లర్లు నిర్మించి రిటైనింగ్ వాల్స్‌ నిర్మాణం కోసం పనులు చేపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఫైల్స్‌లో కాంక్రీట్ నింపుతుండగా పై నుంచి మట్టి జారి పడిపోవడంతో కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు.

భవన నిర్మాణంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. భవన నిర్మాణ పనుల కోసం సూర్యాపేట, బీహార్‌ నుంచి వచ్చిన కార్మికులు విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Whats_app_banner