Korutla Missing: కోరుట్లలో ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం, ఆచూకీ లభించక కుటుంబ సభ్యులు ఆందోళన
Korutla Missing: జగిత్యాల జిల్లా కోరుట్ల లో వివాహిత ముగ్గురు పిల్లల సహా అదృశ్యం అయింది. ఐదు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆటో డ్రైవర్ పై అనుమానం వ్యక్తం చేస్తు పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
Korutla Missing: కోరుట్లలో వివాహిత అదృశ్యం ఘటన కలకలకం రేపుతోంది. ఐదురోజులుగా తల్లిపిల్లల అచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్ళిన భర్త ఆగమేఘాలపై స్వగ్రామానికి చేరుకుని భార్య పిల్లల ఆచూకీ కోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు.
కోరుట్ల పట్టణంలో నివాసం ఉండే కేలేటి మహితాశ్రీ రంజిత్ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుటుంబ పోషణకై బతుకుదెరువు కోసం రంజిత్ బహరెన్ దేశం వెళ్ళాడు. ఐదు రోజుల క్రితం ఇంట్లో నుంచి పిల్లలతో బయటకు వెళ్ళిన మహితాశ్రీ తిరిగిరాలేదు.
కుటుంబ సభ్యులు గల్ఫ్ దేశంలో ఉన్న భర్తకు సమాచారం అందించి ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యంపై పోలీసులకు పిర్యాదు చేశారు. ఐదు రోజులైన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ నేరెళ్ళ మల్లిఖార్జున్ పై అనుమానం వ్యక్తం చేస్తు పోలీసులకు పిర్యాదు చేశారు.
బెహరన్ దేశం నుంచి తిరిగొచ్చిన భర్త
భార్య పిల్లలు అదృశ్యంతో గల్ప్ దేశం బెహరాన్ లో ఉన్న భర్త రంజిత్ ఆగమేఘాలపై స్వగ్రామానికి తిరిగొచ్చారు. తన భార్య మహితాశ్రీతోపాటు తన ముగ్గురు పిల్లలు విజ్ఞశ్రీ, విఘ్నేష్, వేదాన్ష్ ఐదు రోజుల నుంచి కనిపించడం లేదని, ఎవరికైనా కనిపిస్తే చెప్పండి ప్లీజ్ అంటూ రంజిత్ వేడుకుంటున్నాడు.
తాను బతుకు తెరువు కోసం బెహరెన్ దేశం వెళ్లానని, విషయం తెలుసుకొని, అక్కడి నుంచి వచ్చానని చెబుతున్నారు. ఆచూకీ లభిస్తే 8464842401, 8500601232 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని చెప్పాలని కోరుతున్నాడు.
విచారణ చేపట్టిన పోలీసులు
ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రంజిత్ తోపాటు ఆయన తల్లి లక్ష్మి పిర్యాదు మేరకు ఆచూకీ కనుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. మహితాశ్రీ ఫోన్ కలువకపోవడం...నెట్ వర్క్ కు అందుబాటులో లేకుండా పోవడంతో పాటు అనుమానితుడు ఆటో డ్రైవర్ మల్లిఖార్జున్ సైతం అందుబాటులో లేకపోవడంతో ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. మాయ మాటలు చెప్పి మల్లిఖార్జున్ తీసుకెళ్ళినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు సరిగా స్పందించకపోవడంతోనే ఐదురోజులైన ఆచూకీ లభించలేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు పిల్లలతో సహా తల్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తే పోలీసులు లైట్ గా తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనిపించకుండా పోయిన వారి ఫోన్ సిమ్ కార్డ్ లు నెట్వర్క్ కు దూరంగా ఉన్నాయని, ట్రేస్ కావడం లేదని పోలీసులు చేతులు దులుపుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ తోపాటు ముగ్గురు పిల్లల తల్లి ఆచూకి కనుక్కునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)