Gold | పూజ గదిలో 4 కోట్ల బంగారం.. ఆ ఒక్క పని చేస్తే చాలని చెప్పి..-fake babas took 8 lakh rupees in medchal district in the name of puja ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Fake Babas Took 8 Lakh Rupees In Medchal District In The Name Of Puja

Gold | పూజ గదిలో 4 కోట్ల బంగారం.. ఆ ఒక్క పని చేస్తే చాలని చెప్పి..

HT Telugu Desk HT Telugu
May 23, 2022 02:24 PM IST

టెక్నాలజీ ఎంత పెరుగుతున్న మూఢనమ్మకాల ముసుగున మోసాలు జరుగుతూనే ఉన్నాయి. పూజ చేసి బంగారం తీస్తామంటే నమ్మే వాళ్లు ఇంకా ఉన్నారు. డబ్బులు పొగొట్టుకుంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మోసపోయోవాళ్లు ఉన్నన్ని రోజులు.. మోసం చేసే వాళ్లు కూడా ఉంటారు. డబ్బు, బంగారం మీద ఆశతో.. మోసం చేసేవారు బుట్టలో పడేస్తారు. ఇంకేం.. అందినకాడికి దోచుకుని వెళ్తారు. మధ్యతరగతి వారి ఆశలే వారికి సంపాదన. అదే నకిలీ బాబాలకు డబ్బు తెచ్చిపెడుతోంది. తాజాగా.. పూజ గదిలో బంగారం వెలికి తీస్తామని నకిలీ బాబాలు మోసం చేశారు. ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్ లో జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరంకి చెందిన మతం చందు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన ఎర్నాళ్ల సంజీవ్ అనే వ్యక్తులు బాబాలుగా అవతారమెత్తారు. ఎవరు అమాయకంగా ఉంటారో వారిని మోసం చేసేద్దామా అని తిరుగుతుంటారు. అలానే.. ఏప్రిల్ 11న ఘట్ కేసర్ మండలం ఎదులాబాద్ కు చెందిన మాచర్ల రాజు వద్దకు వచ్చారు. తమకు తాము బాబాలుగా పరిచయం చేసుకున్నారు. ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడితే.. ఆశీర్వాదిస్తామని.. మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పి నమ్మించారు. నిజమేననుకుని.. రాజు.. దొంగ బాబాలను ఇంటికి తీసుకెళ్లారు. భోజనం చేస్తూ.. పూజ గదివైపు చూశారు. దేవుడి గది ఎందుకు.. మూసి ఉందా అని అడిగారు

కుటుంబ సభ్యుడు ఒకరు చనిపోవడంతో పూజలు చేయడం లేదని రాజు సమాధానం ఇచ్చాడు. ఇంట్లో దయ్యం ఉందని, ఇంటికే అరిష్టమని నకిలీ బాబాలు నమ్మించారు. కచ్చితంగా పూజలు చేయాల్సిందేనని చెప్పారు. వారం తర్వాత వచ్చి ఏవేవో పూజలు చేసి.. రూ.35 వేలు తీసుకుని వెళ్లిపోయారు. మళ్లీ పది రోజుల తర్వాత వచ్చి.. మీ ఇంట్లో పూజ గదిలో రూ.4 కోట్ల విలువైన బంగారం ఉందని చెప్పారు. వారి మాటలను నమ్మిన రాజు.. బయటకు తీయాలని కోరాడు. సిద్దిపేటలో రూ.1.80 లక్షలు విలువ చేసే పూజా సామాగ్రి కొని.. ఇప్పించారు. మూప్పై వేల సామగ్రి తీసుకుని.. మిగతాదంతా నొక్కేశారు.

ఇక రాజు పూర్తి నకిలీ బాబాలను నమ్మేశాక.. తమ ప్లాన్ అమలు చేశారు. విడతల వారీగా పూజల పేర్లు చెబుతూ.. రూ. 7.5 లక్షలు వసూలు చేశారు. పూజలు చేశామని... కొన్ని రోజుల తర్వాత పూజగది తెరిచి చూడాలని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత.. పూజ గది తెరిచి చూసినా.. రాజుకు ఎలాంటి బంగారం కనిపించలేదు. మోసపోయామని గ్రహించారు. ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి.. దొంగ బాబాలను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి.. రూ. 15 వేల నగదు, కారు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

IPL_Entry_Point

టాపిక్