TG Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్ పాటించాల్సిందే!
TG Govt Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 1 నుంచి కొత్త రూల్ పాటించాల్సిందే. అవును.. సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల అటెండెన్స్ విధానాన్ని మార్చారు. ఇకనుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు జనవరి 1 నుంచి కొత్త రూల్ పాటించాలి. ఇప్పటి వరకూ అమలు చేస్తున్న అటెండెన్స్ విధానాన్ని ప్రభుత్వం మార్చింది. జనవరి 1 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానం అటెండెన్స్‌ని అమలు చేయనుంది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అటెండెన్స్ విధానం అన్ని శాఖల ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జనవరి 1 నుంచి..
రోజు వారీ విధులకు హాజరయ్యే ఉద్యోగుల హాజరు నమోదు కోసం.. ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగానే సచివాలయంలో ప్రతీ శాఖ ఎంట్రీ దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ పరికరాలను ఏర్పాటు చేసింది. వాస్తవానికి వీటిని డిసెంబర్ 12 గురువారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇన్ని ట్రయల్ నిర్వహించారు. అంతా సెట్ అవ్వడంతో.. జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆ ఫేషియల్ రికగ్నిషన్ విధానంలోనే అటెండెన్స్ రిజిస్టర్ అవుతుంది. దాన్నే పరిగణలోకి తీసుకోనున్నారు.
లేట్‌గా వస్తే అంతే..
ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా ఉద్యోగులు టైమ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగి అటెండెన్స్ టైమ్ కచ్చితంగా నమోదు అవుతుంది. దీంతో లేట్‌గా వచ్చే ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఉద్యోగులు సాయంత్రం కూడా తొందరగా వెళ్తున్నారు. అలాంటి వారిని పట్టుకోవడానికి కూడా ఈ విధానం మేలు చేస్తుంది. ఈ విధానం వల్ల ఉద్యోగులు సరిగా విధులకు వస్తారని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
స్కూళ్లలో బయోమెట్రిక్..
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ.. విద్యాశాఖ 2022లో ఉత్తర్వులు జారీ చేసింది. మేరకు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఈ పద్ధతిని అనుసరించాలని ఆదేశించింది.
కొవిడ్ కారణంగా..
ఈ విధమైన అటెండెన్స్ కాలిక్యులేషన్ సహాయంతో విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేయడం, స్కాలర్‌షిప్, ఫీ రియంబర్స్‌మెంట్ వంటి వాటికి ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా బోధన, బోధనేతర సిబ్బంది డ్యూటీ గంటలు, సెలవును లెక్కించడానికి ఉపయోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కోవిడ్ మహమ్మరి కారణంగా బయోమెట్రిక్ హాజరును కొన్నాళ్లు నిలిపివేశారు. 2022లో తిరిగి ప్రారంభించారు.