Ponguleti Challenge మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిఆర్‌ఎస్ పార్టీ నాయకత్వానికి సవాలు విసిరారు. దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. దమ్మపేట మండలం నెమలిపేటలో జరిగిన అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి, తన మద్దతు దారుల్ని సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నానని దమ్ము, ఖలేజా ఉంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సభావేదిక నుంచి సవాల్ చేశారు.,''పొంగులేటికి బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం ఉందా? అని అడుగుతున్నారని, గత డిసెంబర్ వరకు పార్టీ స భలు, సమావేశాలకు తనకు ఎందుకు ఆహ్వా నం పంపారని ప్రశ్నించారు. ఫ్లెక్సీల్లో ఫొటోలు ఎందు కు ఉపయోగించారని, ఎన్నికలప్పుడు నా సా యం ఎందుకు కోరారని ప్ర శ్నించారు. తాను ఏ పార్టీలో చేరినా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులే, ఆ పార్టీ గుర్తుపై ఎన్నికల బరిలో ఉంటారని, అలా చేయగలిగే దమ్ము, ధైర్యం ఉందన్నారు. ,ఎవరో ఇబ్బంది పెట్టారని, మరెవరో పిలుస్తున్నారని తొందరపడి పార్టీ మారే ఉద్దేశం తనకు లేదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి త మ బృందం అభ్యర్థి జారె ఆదినారాయణ ఉంటారని చెప్పారు. పొంగులేటి ఆత్మీయ సభలకు వెళ్లొద్దని హెచ్చరించిన పార్టీ, ఆదివారం పలువురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సోమ వారం నిర్వహించిన సమావేశానికి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో పాటు నలభై మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మండల, జిల్లాస్థాయి నేతలు హాజరయ్యారు. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా సర్పంచ్‌లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.,పొంగులేటికి చెక్ పెట్టడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులపై బీఆర్ఎస్ నాయకత్వం భారీగా వేటు వేసింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆధిపత్యంలో ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో పొంగులేటి వర్గం కూడా పోటీగా నిలుస్తోంది. ఏ పార్టీలో చేరేది చెప్పకపోయినా అభ్యర్థుల్ని ముందే ప్రకటిస్తున్నారు. వైరా అభ్యర్థిగా విజయ భాయ్ పేరును ప్రకటించారు. దీంతో వైరా మునిసిపాలిటీలో పలువురిని బిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ,మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లో తన అభ్యర్థులు ఉంటారని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తాను టిఆర్ఎస్ నుంచి గెలవలేదని వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలిచానని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సిట్టింగ్ స్థానం తనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం దారుణమైన విషయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌కు శ్రీనివాసరెడ్డికి మధ్యలోనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో తన అభ్యర్థులు ఉంటారని, పది మంది అభ్యర్థులు గెలవడం ఖాయమని పొంగులేటి చెబుతున్నారు.