TS Finance Commission : ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య-ex mp siricilla rajaiah appointed as telangana state finance commission chairman ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ex Mp Siricilla Rajaiah Appointed As Telangana State Finance Commission Chairman

TS Finance Commission : ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 16, 2024 06:18 PM IST

Telangana Finance Commission chairman: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య నియమితులయ్యారు. నియామకానికి సంబంధించిన దస్త్రానికి గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు.

సిరిసిల్ల రాజయ్య
సిరిసిల్ల రాజయ్య (facebook)

Warangal Ex MP Siricilla Rajaiah:వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. మరో ముగ్గురు కమిషన్ సభ్యులుగా ఉన్నారు. వీరి నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ - సిరిసిల్ల రాజయ్య

ఎం.రమేశ్‌ - కమిషన్ సభ్యుడు(వికారాబాద్ జిల్లా)

సంకేపల్లి సుధీర్‌రెడ్డి - కమిషన్ సభ్యుడు(సూర్యాపేట జిల్లా)

నెహ్రూ నాయక్‌ మాలోత్‌ - కమిషన్ సభ్యుడు(మహబూబాబాద్ జిల్లా)

వీరి నియామాకానికి సంబంధించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదముద్రవేశారు. వీరు రెండేళ్లపాటు పదవిలో ఉండనున్నారు.

రాజయ్య ప్రస్థానం…

సిరిసిల్ల రాజయ్య వరంగల్లు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 15వ లోక్ సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు రాజయ్య. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కడియం… 3,92,574 ఓట్ల తేాడాతో భారీ విజయాన్ని సాధించారు.

మరోవైపు సిరిసిల్ల రాజయ్య కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఆయన కోడలు ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యారు. 2015లో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కోడలి ఆత్మహత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం 2022 మార్చిలో రాజయ్య కుటుంబాన్ని నిర్దోషిగా తేల్చింది. తిరిగి సొంత గూటికి చేరుకున్న రాజయ్య… పార్టీలో క్రియాశీలకంగా మారారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటును ఆశించారు. అయితే ప్రస్తుతం ఆయన్ను ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా నియమించటంతో ఆయన పోటీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు….

ఇవాళ బీఆర్ఎస్ కు చెందిన పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి… హస్తం కండువా కప్పుకున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా … ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం… వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పట్నం ఫ్యామిలీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో చెవేళ్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక వీరే కాకుండా… అల్లు అర్జున్ మామ అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. 2014లో బీఆర్ఎస్ తరపున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో సాగర్ టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. ఇయన కాంగ్రెస్ నుంచి మల్కాజ్ గిరి టికెట్ ఆశిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం