'కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దుష్ప్రచారం - వాస్తవాలు' అనే అంశంపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.మేడిగడ్డ ప్రాజెక్టులో 85 పిల్లర్లకు కేవలం 2 మాత్రమే కుంగితే... మొత్తం ప్రాజెక్టే కూలిపోయినట్లు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేదన్నారు. కానీ... కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతామని... వాస్తవాలను వాళ్ల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.