KCR : రానున్న రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారం అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో సింగిల్ గానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గోదావరిఖని నుంచి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర...కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు చేరుకుంది. ఈ బృందంతో భేటీ అయిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కాంగ్రెస్ పాలన రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం ఎంతవరకైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ పేర్కొన్నారు. అందరూ ఒక్కో కేసీఆర్‌ల తయారై సమస్యలపై పోరాడాలన్నారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని నేతలకు కేసీఆర్ దిశనిర్దేశం చేశారు. కాళేశ్వరం నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు.
రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి కన్నీటి గోస పేరిట రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు 200 మందితో...180 కిలోమీటర్ల పాదయాత్ర వారం రోజుల పాటు కొనసాగి శనివారం ముగిసింది. పాదయాత్రకు వచ్చిన వీరి బృందం కేసీఅర్ సమావేశమయ్యారు .
పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుందని చెప్పారు. ఆనాడు ప్రధాని మోదీ తన మెడపై కత్తి పెట్టినా తెలంగాణ కోసం తాను ఎక్కడ వెనకడుగు వేయలేదన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. తెలంగాణకు ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని విమర్శించారు.
ఏపీలో కూటమి లేకుంటే సీఎం చంద్రబాబు గెలిచేవారు కాదని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపారని కేసీఆర్ అన్నారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదన్న ఆయన.. అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని మండిపడ్డారు. మేనిఫెస్టోలో పెట్టకపోయిన రైతుబంధు, కల్యాణ లక్ష్మీ వంటి పథకాలను ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వదేనని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.
సంబంధిత కథనం