Power Bill : కరెంట్ బిల్పై అనుమానం ఉందా..? డిస్కం వెబ్‌సైట్‌లో సరికొత్త ఆప్షన్, ఇలా చెక్ చేసుకోండి
TGSPDCL Power Charges : కరెంట్ బిల్లులో తేడాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయా..? ఇలాంటి వాటిని నివృత్తి చేసేందుకు అధికారులు సరికొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
TGSPDCL Power Charges : కరెంట్ బిల్లు భారీగా వస్తుంది…! మేం తక్కువగానే వాడుతున్నాం కదా..! అయినా కూడా ఇంత బిల్లు వచ్చిందా..? అసలు ఈ బిల్లులను ఏ ప్రతిపాదికన వేస్తున్నారు..? వంటి అనుమానులు వినియోగదారుడికి ఉంటాయి. ఇదే విషయంపై క్లారిటీ తీసుకునేందుకు అధికారులను కూడా సంప్రదిస్తుంటారు.
ఇలాంటి అనుమానాలకు చెక్ పెట్టడంతో పాటు విద్యుత్ వినియోగదారులకు పారదర్శమైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో అధికారులు సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. డిస్కం వెబ్ సైట్ లో డిజిటల్ కాలిక్యులేటర్ ఆప్షన్ ను తీసుకొచ్చారు. ఈ సదుపాయాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకుని అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
డొమెస్టిక్ కస్టమర్స్ కరెంటు వాడకం బిల్లు చెక్ చేసుకునేందుకు ఈ ఆప్షన్ పని చేస్తుంది. ఇందుకోసం వినియోగదారులు https://tgsouthernpower.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇందులో ఎనర్జీ చార్జెస్ క్యాలిక్యూలేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి… మీటర్ రీడింగ్ వివరాలను ఎంట్రీ చేస్తే మీ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు డిస్ ప్లే అవుతాయి.
ఎన్ని రోజులకు బిల్లింగ్ అయింది..? రీడింగ్ తీసిన తేదీలను సరిపొల్చుకోవచ్చు. ఫలితంగా నమోదైన కరెంట్ బిల్లు సరైనదేనా లేదా అనే దానిపై అంచనాకు రావొచ్చు. యూనిట్ల వివరాలను కాలిక్యులేటర్‌లో నమోదుచేస్తే బిల్లింగ్ రోజులు, ఎంత ఛార్జీ వేశారనే వివరాలు కూడా తెలుస్తాయని TGSPDCL సీఎండీ తెలిపారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి డైరెక్ట్ గా వివరాలను తెసుకోవచ్చు : Energy Charges Calculator for Domestic Services