Electricity Bills | తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంపు.. ఎంత పెంచుతున్నారో తెలుసా?-electricity bills set to go up in telangana from april 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Electricity Bills | తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంపు.. ఎంత పెంచుతున్నారో తెలుసా?

Electricity Bills | తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంపు.. ఎంత పెంచుతున్నారో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Mar 23, 2022 05:31 PM IST

త్వరలో కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. 2016-17 నుంచి... ఐదేళ్లుగా టారీఫ్ పెరగలేదని చెప్పారు. ఈ మేరకు 2022-23కు సంబంధించిన టారీఫ్ ప్రపోజల్స్ ను ప్రకటించారు.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం (unplash)

టారీఫ్ ఛార్జీలపై నిర్ణయం తీసుకున్నట్టు ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. 2022-23 టారీఫ్ ప్రపోజల్స్ ను తెలిపారు. రూ.53,053 కోట్లు ప్రతిపాదించగా.. రూ.48708 కోట్లు ఆమోదించినట్టు పేర్కొన్నారు. రూ.6,338 ద్రవ్యలోటు..ఉంటే.. రూ.5,596 కోట్లు ఆమోదించిందన్నారు. రూ.8221.17 కోట్లు సబ్సిడీ వ్యవసాయానికి ప్రతిపాదించారు. గతంలో ఉన్నదానికంటే 38.38 శాతం అధికంగా ఉంది.

డిస్కమ్స్ పై భారం పడకూడదని.. రూ.7.03 శాతం సగటు ధర పెరిగిందని చెప్పారు. కమిషన్ 18 శాతం ప్రతిపాదిస్తే.. 14 శాతం వరకే పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎల్.టి.కి 15 శాతం కుదించామని ఈఆర్సీ ఛైర్మన్ వెల్లడించారు. వ్యవసాయానికి టారీఫ్ పెంచలేదని స్పష్టం చేశారు. ఈవీ ఛార్జింగ్ కు టారీఫ్ ప్రతిపాదనలు ఆమోదించలేదన్నారు. డిస్కమ్స్ నవంబర్ 30వ తేదీ లోపు ప్రతిపాదనలు కమిషన్ ముందు కచ్చితంగా ఉంచాలని శ్రీరంగారావు చెప్పారు. ఆసక్తిగల వినియోగదారులకు స్మార్ట్ ప్రిపేయిడ్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశించినట్టు తెలిపారు. జీడిమెట్ల స్మార్ట్ గ్రిడ్ పూర్తిస్థాయిలో విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గృహా వినియోగదారులకు-50 పైసలు, పరిశ్రమలు 1 రూపాయి టారీఫ్ పెంచనున్నట్టు వెల్లడించారు.

 

<p>విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్ణయం</p>
విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్ణయం
Whats_app_banner