హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. లాయర్ ఇజ్రాయిల్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు ఎలక్ట్రీషియన్ దస్తగిరి. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. లాయర్ ఇజ్రాయిల్ మృతిచెందారు. ఓ మహిళను వేధిస్తున్న ఘటనలో దస్తగిరిపై లాయర్ ఇజ్రాయిల్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కక్ష పెంచుకుని ఇజ్రాయిల్‌పై కత్తితో దాడి చేశాడు.
హైదరాబాద్ సంతోష్‌నగర్ పరిధిలోని న్యూ మారుతీనగర్‌లో ఈ ఘటన జరిగింది. అడ్వకేట్ ఇజ్రాయిల్ ఇంట్లో అద్దెకు ఉండే ఓ మహిళను.. దస్తగిరి అనే ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వేధింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ ఇజ్రాయిల్‌కు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపైనే ఫిర్యాదు చేస్తారా అని.. కక్ష గట్టిన దస్తగిరి అడ్వకేట్ ఇజ్రాయిల్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
మర్డర్ సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదుచేసి నిందితుడిన అదుపులోకి తీసుకున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఈ దారుణం జరగడంతో.. స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లో హత్యలు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు వంటి వ్యక్తిగత కారణాల వల్ల హత్యలు జరుగుతున్నాయి. దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాప్‌ల వంటి నేరాల సమయంలో కూడా హత్యలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు గ్యాంగ్ వార్‌ల కారణంగా కూడా హత్యలు జరుగుతున్నాయి. మానసిక సమస్యలు ఉన్నవారు కూడా కొన్నిసార్లు హత్యలకు పాల్పడుతున్నారు. మద్యం, మత్తు పదార్ధాల ప్రభావం వల్ల కూడా కొందరు హత్యలకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ పోలీసులు హత్యలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించడం చాలా కష్టం అని నిపుణులు చెబుతున్నారు. నగర జనాభా పెరుగుదల, ట్రాఫిక్ సమస్యలు, సైబర్ నేరాలు వంటివి పోలీసులకు సవాళ్లుగా మారుతున్నాయి. నేరాలను నియంత్రించడానికి పోలీసులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. కానీ.. ఎక్కడో ఒకచోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి.