Hyderabad Electrical Buses: హైదరాబాద్‌లో మరిన్ని ప్రాంతాలకు ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులు-electric bus services to more parts of hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Electrical Buses: హైదరాబాద్‌లో మరిన్ని ప్రాంతాలకు ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులు

Hyderabad Electrical Buses: హైదరాబాద్‌లో మరిన్ని ప్రాంతాలకు ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులు

HT Telugu Desk HT Telugu
Aug 28, 2023 01:13 PM IST

Hyderabad Electrical Buses: హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఎంఎంటిఎస్‌, మెట్రో రైలు సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాలకు ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ బస్సులు
హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ బస్సులు

హైదరాబాద్‌లో పలు ప్రాంతాలకు ఎలక్ట్రికల్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురావాలని టిఎస్‌ ఆర్టీసి నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్, మియాపూర్ ఆర్టీసీ డిపోల పరిధిలో ఈ బస్సులను నడిపాలని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ – పంజాగుట్ట – జూబ్లీహిల్స్ చెక్ పోస్టు – ఫిల్మ్ నగర్ – ఉస్మానియా కాలనీల మీదుగా మణికొండ వరకు ఈ సర్వీసులు నడపాలని నిర్ణయించారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్‌బీ నగర్, ఇబ్రహీంపట్నం వరకు నడపాలని నిర్ణయించారు.

మియాపూర్ డిపో పరిధిలో బాచుపల్లి – జేఎన్‌టీయూ – కేపీహెచ్‌బీ – హైటెక్ సిటీ – బయోడైవర్సిటీ – గచ్చిబౌలి – వేవ్ రాక్ – ప్రగతి నగర్ – జేఎన్‌టీయూ, వీబీఐటీ వరకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులన్నింటికి జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అమర్చుస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి 30 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉండే విధంగా బస్సులను నడపనున్నారు.