Hyderabad Metro | మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ కోసమే ఎలక్ట్రిక్ ఆటోలు-electric auto services starts to improve connectivity for hyderabad metro ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro | మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ కోసమే ఎలక్ట్రిక్ ఆటోలు

Hyderabad Metro | మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ కోసమే ఎలక్ట్రిక్ ఆటోలు

HT Telugu Desk HT Telugu
Apr 21, 2022 02:58 PM IST

మెట్రో రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

<p>మెట్రో రైడ్ ఎలక్ట్రిక్ ఆటోలు</p>
<p>మెట్రో రైడ్ ఎలక్ట్రిక్ ఆటోలు</p>

మెట్రో రైల్ ప్రయాణికుల కోసం.. మెట్రో రైడ్ పేరిట మరో సర్వీస్ ను తీసుకొచ్చారు. మెట్రో రైడ్ ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి.. తీసుకొచ్చామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్ నుంచి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. మరోవైపు మెట్రో ఫేజ్ 2పైనా దృష్టిపెట్టారు. నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌ వద్ద మెట్రో రైడ్‌ ఎలక్ట్రిక్ ఆటోలను ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు.

'మెట్రో ఫేజ్​ 2 కింద శంషాబాద్‌ ఎయిర్ పోర్టు మెట్రో నిర్మాణానికి రూ. 5 వేల కోట్ల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. మెట్రో రైల్‌లో ప్రయాణం చేసి మెట్రో స్టేషన్ నుంచి గమ్యస్థానానికి చేరేలా ఎలక్ట్రిక్‌ ఆటోలను ఏర్పాటు చేశాం. ప్రైవేటు వాహనాలతో పోల్చుకుంటే.. తక్కువ ఛార్జీలు వసూలు ఉంటుంది.' మైట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

కరోనాతో హైదరాబాద్ మెట్రో నష్టపోయిందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దాదాపు మూడు వేల కోట్ల నష్టం వచ్చినట్టుగా తెలిపారు. నష్టాలున్నా.. మధ్యలో ఆపేయకుండా.. నిర్వహిస్తున్నట్టుగా పేర్కొన్నారు. మెట్రో ప్రయాణికుల కోసం.. మరిన్ని సౌకర్యాలు తీసుకొస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ఫేజ్​ 2 లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని తెలిపారు.

సూపర్ సేవర్ కార్డ్

హైదరాబాద్ లో ఉండేవారికి, నగరాన్ని సందర్శించే వారికి.. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే బంపర్ ఆఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ కార్డును తీసుకొచ్చంది. దీంతో రూ.59 ఉండే చాలు.. మెట్రోలో భాగ్యనగరాన్ని చూట్టేయోచ్చు. అయితే దీనికి ప్రత్యేకంగా కొన్ని రోజులను కేటాయించింది. ప్రతి రోజూ వెళ్లి.. 59కే తిరగాలంటే.. కుదరదు.. ప్రత్యేకంగా చెప్పిన రోజుల్లోనే తిరగాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఎల్&టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. సూపర్ సేవర్ కార్డుతో ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

'సూపర్ సేవర్ కార్డుతో కేవలం రూ.59తో రోజంతా ప్రయాణించవచ్చు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ కార్డును వినియోగించుకోవచ్చు. అయితే ఇందులో ఒక కండీషన్ ఉంది. ప్రతీ ఆదివారం, ప్రతీ రెండో, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగి, శివరాత్రి.. ఇలా మెుత్తం 100 సెలవు రోజుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది.' అని కేవీబీ రెడ్డి తెలిపారు.

సంబంధిత కథనం

టాపిక్