TG New Ration Cards : మీసేవలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు ఈసీ బ్రేక్, క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
TG New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసిందని ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను నిలిపివేశారని జరిగి ప్రచారం వాస్తవరం కాదని సీఈసీ పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

TG New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసిందని ప్రచారం జరిగింది. కొత్త తెల్ల రేషన్ కార్డులకు మీసేవలో అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను తక్షణమే నిలిపివేయాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారం అవాస్తమని సీఈసీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
మీసేవలో దరఖాస్తులు గందరగోళం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించే వారు. మీసేవ కేంద్రాల ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు, మార్పుచేర్పుల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా మీసేవలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియకు ఈసీ బ్రేక్ వేసిందని మరో ప్రచారం జరిగింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
మీసేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులుస్వీకరించాలని మీసేవ కేంద్రాలకు ఉత్తర్వులే ఇవ్వలేదని పౌరసరఫరాలశాఖ పేర్కొంది. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపించాలని మీ సేవ కేంద్రాలను కోరినట్టు పౌరసరఫరాలశాఖ కమిషన్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి ప్రజలు మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రయత్నించారు. దరఖాస్తులు స్వీకరించకపోవడంతో గందరగోళం ఏర్పడింది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు నిలిపివేసిందని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సీఈసీ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. పౌరసరఫరాల శాఖ కానీ, మీసేవ కాని తమను సంప్రదించనే లేదని సుదర్శన్ రెడ్డి తెలిపారు. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం లేదని పౌరసరఫరాల శాఖ తాజాగా వెల్లడించింది. మార్పులు, చేర్పుల కోసం మీ సేవ ద్వారా ఇప్పటికే దరఖాస్తులు అందుతున్నాయన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు
ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ , స్టేట్ రిసోర్స్ పర్సన్‌లను ఎంపిక చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు సీఈసీ శిక్షణ ఇవ్వనుంది. మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్, స్టేట్ రిసోర్స్ పర్సన్‌లకు ఎంసీహెచ్ఆర్డీలో ఇప్పటికే ఎన్నికల సంఘం శిక్షణ ఇచ్చింది.
జిల్లా కలెక్టర్లకు సీఈసీఎ కీలక ఆదేశాలు జారీ చేసింది. మండల, జిల్లా పరిషత్, పంచాయతీ రిటర్నింగ్ అధికారులను ఫిబ్రవరి 10వ తేదీ లోపు ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది. పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం ఎంపిక చేసిన రిటర్నింగ్ అధికారులకు ఫిబ్రవరి 12లోపు శిక్షణ పూర్తి చేయాలని తెలిపింది. పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు ఈ నెల 15లోపు శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించింది. పోలింగ్ సిబ్బందికి మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్‌తో శిక్షణ పూర్తి చేయాలని తెలంగాణ ఎన్నికల సంఘం ఆదేశించింది.
సంబంధిత కథనం