TS Medical Colleges : ఒకే రోజు ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభం-eight medical colleges start on november 5th in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Eight Medical Colleges Start On November 5th In Telangana

TS Medical Colleges : ఒకే రోజు ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 10:47 AM IST

Telangana Medical Colleges : తెలంగాణలో ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఒకే రోజు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణ మెడికల్ కాలేజీలు
తెలంగాణ మెడికల్ కాలేజీలు (unsplash)

తెలంగాణ(Telangana)లో రూ.4,080 కోట్లతో ఏర్పాటు చేసిన ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాల(Govt Medical Colleges)లను ఒకేరోజు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాత్కాలికంగా 1,200 ఎంబీబీఎస్ సీట్ల(MBBS Seats)ను అందించే కళాశాలలను నవంబర్ 15 న ప్రారంభించాలని నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలను ఏర్పాటు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) తెలిపారు. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, రామగుండం(Ramagundam)లో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎంబీబీఎస్‌ విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి 1,200 మెడికల్‌ సీట్ల(1200 Medical Seats)ను ఒకేసారి అందించడం తెలంగాణలో ఇదే తొలిసారి .

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt).. కాలేజీల అభివృద్ధికి ఒక్కోదానికి రూ.510 కోట్లు, మెుత్తం రూ.4,080 కోట్లు వెచ్చించింది. పక్కనే ఉన్న జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేసి కాలేజీలకు అటాచ్ చేశారు. 1,200 MBBS సీట్లతో పాటు, ప్రైవేట్ మెడికల్ కాలేజీ(Private Medical Colleges)లలో 85 శాతం B- కేటగిరీ మెడికల్ సీట్లను తెలంగాణ విద్యార్థులకు రిజర్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుండి అదనంగా 1,068 సీట్లు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.

2014లో తెలంగాణ(Telangana)లో మొత్తం 850 మెడికల్ సీట్లు ఉండగా, 2022 నాటికి వాటి సంఖ్య 2,901కి పెరిగింది. తెలంగాణలో 192 అదనపు పీజీ ప్రభుత్వ మెడికల్ సీట్లను కూడా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014లో 613 పీజీ సీట్లు ఉండగా మొత్తం పీజీ ప్రభుత్వ మెడికల్ సీట్ల సంఖ్య 1,249కి చేరింది.

IPL_Entry_Point