EFLU Hyd Recruitment : ఇఫ్లూలో 97 నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు - అర్హతలివే, ఇలా అప్లయ్ చేసుకోండి-eflu issues notifications for 97 non teaching jobs 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Eflu Issues Notifications For 97 Non-teaching Jobs 2023

EFLU Hyd Recruitment : ఇఫ్లూలో 97 నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు - అర్హతలివే, ఇలా అప్లయ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 02, 2023 05:50 PM IST

Hyderabad EFLU Recruitment 2023: హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఖాళీగా ఉన్న నాన్ - టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇఫ్లూలో భారీగా నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు
ఇఫ్లూలో భారీగా నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు

Hyderabad EFLU Recruitment 2023 Updates: హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న .. 97 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ చేయనుంది. ఈ మేరకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఒక్కో పోస్టుకు సంబంధించి పలు అర్హతలను నిర్ణయించింది. ఇందులో గ్రూప్ ఎ, గ్రూప్ బి, గ్రూప్ - సి కేటగిరి పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. www.efluniversity.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

ఖాళీల వివరాలు :

గ్రూప్-ఎ పోస్టులు

1. డిప్యూటీ రిజిస్ట్రార్- 01

2. అసిస్టెంట్ రిజిస్ట్రార్- 04

3. హిందీ ఆఫీసర్‌- 01

4. డిప్యూటీ లైబ్రేరియన్- 02

5. అసిస్టెంట్ లైబ్రేరియన్- 05

6. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 01

గ్రూప్- బి పోస్టులు:

1. సెక్షన్ ఆఫీసర్- 01

2. అసిస్టెంట్- 07

3. పర్సనల్ అసిస్టెంట్- 06

4. ప్రొఫెషనల్ అసిస్టెంట్- 01

5. అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)- 01

6. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 01

7. సెక్యూరిటీ ఆఫీసర్- 01

8. ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ-వీసీ)- 01

9. హిందీ ట్రాన్స్‌లేటర్‌- 01

10. స్టాటిస్టికల్ అసిస్టెంట్- 01

గ్రూప్-సి పోస్టులు:

1. అప్పర్ డివిజన్ క్లర్క్- 07

2. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 02

3. లోయర్ డివిజన్ క్లర్క్- 56

4. హిందీ టైపిస్ట్- 01

5. డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్)- 01

6. కుక్- 01

7. ఎంటీఎస్‌- 29

మొత్తం పోస్టుల సంఖ్య - 97

అర్హతలు - పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తుల తుది గడువు: 26 - జూన్- 2023.

అధికారిక వెబ్ సైట్ - www.efluniversity.ac.in

పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన PDF చూడండి….

WhatsApp channel