Govt Jobs 2024 : హైదరాబాద్ ఈసీఐఎల్ లో 115 ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వూనే..!
ECIL Hyderabad Recruitment 2024 : హైదరాబాద్ ఈసీఐఎల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అటామిక్ ఎనర్జీ విభాగానికి సంబంధించి హైదరాబాద్‌తో పాటు పలు జోనల్ కార్యాలయాల్లో పనిచేసేందుకు 115 ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది.
ECIL Hyderabad Recruitment 2024 : హైదరాబాద్ ఈసీఐఎల్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ ప్రతిపాదికన 115 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… ఆగస్టు 8వ తేదీతో గడువు పూర్తి కానుంది.
అటామిక్ ఎనర్జీ విభాగానికి సంబంధించి హైదరాబాద్‌తో పాటు పలు జోనల్ కార్యాలయాల్లో పనిచేసేందుకు 115 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.ఐటీఐ, బీఈ లేదా బీటెక్ అర్హతతో వీటిని భర్తీ చేస్తారు. పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ(1:4 నిష్పతిలో) ఆధారంగానే రిక్రూట్ చేయనున్నారు. ప్రాజెక్ట్ ఇంజినీర్ 20 పోస్టులు ఉండగా… జూనియర్ టెక్నీషియన్ (గ్రేడ్ 2) ఉద్యోగాలు 42 ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 53 ఉన్నట్లు నోటిఫికేషన్ తెలిపారు.
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన -ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్
మొత్తం ఖాళీలు - 115
కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తారు.
భర్తీ చేసే పోస్టులు - ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్(గ్రేడ్ల వారీగా ఖాళీలను పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు)
అర్హతలు - ఐటీఐ, బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించారు. పూర్తిస్థాయి నోటిపికేషన్ లో ఈ వివరాలను చూడొచ్చు.
వయోపరిమితి - 33 ఏళ్ల లోపు ఉండాలి. కొన్ని పోస్టులకు 30 ఏళ్లు మించరాదు.
వేతనం - ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు నెలకు రూ.40,000- రూ.55,000గా ఉంది. టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.25,000- రూ.31,000, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.22,528- రూ.27,258 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం - రూ. 1000 చెల్లించాలి.
దరఖాస్తులు ప్రారంభం - మార్చి 23, 2024.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - ఆగస్టు 08, 2024.
ఎంపిక విధానం - విద్యార్హత, ఇంటర్వూ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష లేదు.
అధికారిక వెబ్ సైట్ - https://www.ecil.co.in/home.html
కింద ఇచ్చిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో అన్ని వివరాలను చూడొచ్చు….
ఆర్బీఐలో ఉద్యోగాలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ rbi.org.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 94 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆర్బీఐ లో ఆఫీసర్ పోస్టుల కు అప్లై చేయడానికి ఆఖరు తేదీ ఆగస్టు 16. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు 2024 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరుగుతాయి. దీనికి సంబంధించిన తేదీలు నోటిఫికేషన్ లో సవివరంగా ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అన్ని సెమిస్టర్లు/ సంవత్సరాల్లో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ / తత్సమాన సాంకేతిక లేదా వృత్తిపరమైన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు 50% ఉత్తీర్ణత ఉంటే చాలు. లేదా ఏదైనా విభాగంలో 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ / తత్సమాన సాంకేతిక లేదా వృత్తిపరమైన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు పాస్ మార్క్ లు సాధిస్తే చాలు.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. 18% జీఎస్టీ అదనం. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.850 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. 18 శాతం జీఎస్టీ అదనం. అభ్యర్థులు డెబిట్ కార్డులు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డ్/ మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/ మొబైల్ వాలెట్లు, యూపీఐ ద్వారా అప్లికేషన్ ఫీజును చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆర్బీఐ (rbi) అధికారిక వెబ్ సైట్ చూడొచ్చు.