Medak Dumping Yard: డంపింగ్ యార్డ్ తరలించాల్సిందే.. ప్యారానగర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
Medak Dumping Yard: జిహెచ్‌ఎంసి డంపింగ్ యార్డ్‌ను తరలించాలని చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. డంపింగ్ యార్డును తరలించే వరకు వెనడుగు వేసేది లేదని గుమ్మడిదల రైతులు తేల్చి చెబుతున్నారు.

Medak Dumping Yard: 0ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని గుమ్మడిదల రైతులు పోరుబాట పట్టారు. మండలంలోని, ప్యారానగర్ దగ్గరలో ఉన్న 152 ఎకరాల భూముల్లో డంపింగ్ యార్డ్ పెట్టాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించడంతో, రైతులలో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
గుమ్మడిదలలోని అన్ని గ్రామాల్లో రైతులు మంచి కూరగాయలు పండిస్తుంటారు. ప్రతిరోజు ఈ మండలంలోని గ్రామాల నుండి సుమారుగా 20 టన్నుల కూరగాయలు బోయిన్పల్లి, కూకట్ పల్లి, షాపూర్ నగర్, మూసాపేట్ మార్కెట్ లకు వెళ్తుంటాయి. సుమారుగా 2 వేల లీటర్ల పాలు కూడా ఇక్కడి రైతులు ప్రతిరోజు ఉత్పత్తి చేస్తున్నారు.
డంపింగ్ యార్డ్ చేపట్టడం వలన తమ ప్రాంతంలో గాలి, నీరు కాలుష్యం అవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేసారు. డంపింగ్ యార్డ్ ని ఎలాగైనా అడ్డుకుంటామని మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మహిళా రైతులు, యువ రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు
డంపింగ్ యార్డ్ విషయంలో కల్పించుకోవాలని రైతులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు పోస్ట్ కార్డ్స్ పంపాలని నిర్ణయించారు డంప్ యార్డ్ చేపట్టడం వలన, తమకు ఏ విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయో వివరిస్తూ, డంప్ యార్డ్ వేరే ప్రాంతాలకు తరలించాలని వారు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రిని కోరనున్నారు. ఇక్కడి రైతులు, జిల్లాలోని కాంగ్రెస్ లీడర్ల సహాయంతో, ముఖ్యమంత్రిని స్వయంగా కలవటానికి కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఇవేవి తమకు పట్టనట్టుగా, డంప్ యార్డ్ సైట్ కు రోడ్డు వేస్తున్నారు. GHMC అధికారులు ఫారెస్ట్ ల్యాండ్ లో ఉన్న చెట్లు నరికి, డంప్ యార్డ్ కు రోడ్డు వేయటం గమనార్హం. తాము గ్రామాలకు రోడ్లు వేసుకోవటానికి అనుమతి ఇవ్వని అటవీ శాఖ అధికారులు, GHMC చెట్లు కొట్టి రోడ్డు వేసుకోవడానికి ఎలా అనుమతి ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. GHMC చేస్తున్న పనులను రైతులు అడ్డుకోకుండా, అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి తమ పని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.
గుమ్మడిదల మండల కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ)ఆధ్వర్యంలో స్వచ్చందంగా ర్యాలీ. ప్యారానగర్ డంపింగ్ యార్డ్ కి వ్యతిరేక పోరాటం పేరుతో ర్యాలీ నిర్వహించిన గ్రామస్తులు ర్యాలీలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు, గ్రామ యువకులు రైతులు. మాకొద్దు డంపింగ్ యార్డ్ అంటూ నినాదలాతో మండల కేంద్రంలో వీధి వీదికి ర్యాలీ నిర్వహించారు.
డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల రైతులకు అటవీ లోని వన్యాప్రానులకు తీవ్ర నష్టం అంటూ నినాదాలు చేస్తున్నారు. వెంటనే డంపింగ్ యార్డ్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ నుండి ప్రజలను కాపాడాలని భవిష్యత్తు తరాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో ఏక వాక్య తీర్మానం పేరుతో డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా పోస్టల్ బాక్స్ ఏర్పాటు . డంపింగ్ యార్డ్ నిర్ములించే వరకు ఉద్యమం ఆపమని తేల్చి చెబుతున్నారు.