తెలుగు న్యూస్ / తెలంగాణ /
Hyderabad Drunk and Drive Cases : నగరంలో న్యూఇయర్ వేడుకలు - భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, ఎన్ని కేసులంటే...?
Drink and Drive Cases : హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి.మరోవైపు పోలీసులు మాత్రం.. మందుబాబుల ఆట కట్టించారు. చాలాచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఏకంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో 619 కేసులు నమోదయ్యాయి.
భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ పరిధిలో పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. మంగళవారం రాత్రి 8 నుంచి ఇవాళ ఉదయం 7 గంటల వరకు కూడా ఈ టెస్టులు చేయటంతో.. భారీగా కేసులు నమోదయ్యాయి.
- హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కమిషనరేట్ పరిధిలో చూస్తే ఏకంగా 1,184 కేసులు నమోదయ్యాయి.
- హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి.
- ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు . మందు సేవించి వాహనం నడిపిన అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. మల్కాజ్‌గిరి డివిజన్‌లో 230 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.
- న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రంక్ డ్రైవ్ టెస్టుల్లో మందుబాబులు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు. కొందరు పారిపోయేందుకు యత్నించగా.. మరికొందరు టెస్టులకు నిరాకరిస్తూ గొడవకు దిగారు.
- పంజాగుట్టలో పట్టుబడిన ఓ యువకుడికి టెస్ట్ చేయగా… ఏకంగా 550 పాయింట్లు చూయించింది.
- పోలీసుల తనిఖీలను చూసిన మందుబాబులు వాహనాలను వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.
- ఇక హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. రోడ్లపై ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు చేపట్టారు.
- వరంగల్ ట్రై సిటీ పరిధిలో పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేక చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో 330కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రిజిస్టర్ చేశారు.