Warangal Eye Hospital: వరంగల్ కంటి ఆసుపత్రిలో మందుల దందా, మార్కెట్‌లో అమ్ముతున్న ఉద్యోగి అరెస్ట్-drug raid in warangal eye hospital employee selling in market arrested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Drug Raid In Warangal Eye Hospital, Employee Selling In Market Arrested

Warangal Eye Hospital: వరంగల్ కంటి ఆసుపత్రిలో మందుల దందా, మార్కెట్‌లో అమ్ముతున్న ఉద్యోగి అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Mar 22, 2024 08:04 AM IST

Warangal Eye Hospital: వరంగల్‌ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో మందుల్ని అక్రమంగా ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయిస్తున్న ఉద్యోగి పోలీసులకు పట్టుబడ్డాడు.

ప్రభుత్వ మందుల్ని విక్రయిస్తూ పట్టుబడిన నిందితులు
ప్రభుత్వ మందుల్ని విక్రయిస్తూ పట్టుబడిన నిందితులు

Warangal Eye Hospital: వరంగల్ రీజినల్​ ఐ హాస్పిటల్ Regional Eye Hospital (ప్రాంతీయ నేత్ర వైద్యశాల)లో మందుల Drugs Scam దందా బయటపడింది. అందులో పని చేసే ఉద్యోగి ఒకరు ప్రభుత్వం సరఫరా చేసే మందులను ప్రైవేటు మెడికల్​ స్టోర్​ లకు అమ్ముకుంటున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

కొన్ని సంవత్సరాల నుంచి ఈ దందా సాగిస్తూ అక్రమంగా సంపాదిస్తుండగా.. వరంగల్ టాస్క్​ ఫోర్స్ task Force​ పోలీసులు, డ్రగ్​ కంట్రోల్​ ఆఫీసర్లు Drug control office ఆయన గుట్టురట్టు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ మందులు బయటకు పంపిస్తున్న ఉద్యోగితో పాటు ఆయన నుంచి కొనుగోలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

వరంగల్ నగరంలో కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన తలకోటి నాగేందర్​ కొన్నేళ్ల నుంచి వరంగల్ రీజినల్​ కంటి ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్ Pharmacist​ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చే జీతంతో సంతృప్తి పడని ఆయన ఆసుపత్రిలోనే అక్రమ దందాకు తెరలేపాడు.

హనుమకొండలోని సెంట్రల్​ డ్రగ్​ స్టోర్ Central Drug Store​ నుంచి కంటి ఆసుపత్రికి ట్యాబ్లెట్స్​, ఐ డ్రాప్స్​ తదితర మందులు సరఫరా అవుతుండగా.. వాటితో నాగేందర్ అక్రమ బిజినెస్​ మొదలు పెట్టాడు. వివిధ ప్రాంతాల నుంచి కంటి సమస్యలతో వచ్చే పేషెంట్లకు డాక్టర్లు మందులు రాస్తుండగా.. ప్రిస్క్రిప్షన్​ లో రాసిన వాటికంటే ఎక్కువ క్వాంటిటీ మందులు లెక్కల్లో చూపిస్తూ వాటిని గుట్టుగా తన ఇంటికి చేరవేసేవాడు.

ఇంటి నుంచి హైదరాబాద్​ కు షిఫ్ట్​

కంటి ఆసుపత్రిలో ఫార్మసిస్ట్​ గా పని చేస్తున్న నాగేందర్​ కు, హైదరాబాద్​ కు చెందిన బలరాం దాసుతో పరిచయం ఏర్పడింది. నాగేందర్​ తాను ఆసుపత్రి నుంచి తీసుకొచ్చే మందులను బలరాంకు అప్పజెప్తే ఆయన వాటిని హైదరాబాద్​కు తీసుకెళ్లేవాడు. అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన స్టిక్కర్లు తొలగించి, ఆ మందులన్నింటినీ వివిధ మెడికల్​ స్టోర్​ లకు ఎక్కువ ధరకు సరఫరా చేసేవాడు.

ఇలా ఇద్దరు కలిసి గుట్టుగా చిన్నపాటి నెట్​ వర్కే నడిపించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ దందా సాగిస్తూ ఇద్దరూ పెద్ద మొత్తంలో సంపాదించారు. కాగా ఇండెంట్​ పెట్టిన మందులు పెద్ద మొత్తంలో మాయమవుతున్నా అక్కడి అధికారులకు అనుమానం కలగకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

గుట్టురట్టు చేసిన టాస్క్​ ఫోర్స్​

ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే ప్రభుత్వ కంటి సంబంధిత మందులను అక్రమంగా కాజేసి డబ్బులకు బయట అమ్ముతున్న విషయం టాస్క్​ ఫోర్స్​ పోలీసులకు తెలిసింది. దీంతో వరంగల్ టాస్క్​ ఫోర్స్​ సిబ్బంది, డ్రగ్​ కంట్రోల్​ ఆఫీసర్లు గుట్టుగా వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే బలరాం దాసు మందులు తీసుకెళ్లేందుకు హైదరాబాద్​ నుంచి వరంగల్ కు వచ్చినట్లు అధికారులకు సమాచారం అందింది.

దీంతోనే బుధవారం సాయంత్రం టాస్క్​ ఫోర్స్​, డ్రగ్ కంట్రోల్​ ఆఫీసర్లు నాగేందర్​ ఇంట్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నాగేందర్​ ఇంట్లో పెద్ద మొత్తంలో కంటి ఆసుపత్రికి సంబంధించిన మందులు లభించాయి. దీంతో ఇద్దరిని రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకున్న అధికారులు తదుపరి విచారణ నిమిత్తం వారిని ఇంతేజార్​ గంజ్​ పోలీసులకు అప్పగించారు.

డ్రగ్ ఇన్స్పెక్టర్ అరవింద్ పంచనామా నిర్వహించి ఆ మందులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్​ చేసిన వాటిలో 34 బాక్సుల్లో రూ.69,360 విలువైన యాంటీ బయటిక్​ ట్యాబ్లెట్స్, రూ.11,484 విలువైన ఐ డ్రాప్స్​ ఉన్నాయి.

అధికారుల తీరుపై అనుమానాలు

కొన్నేళ్లుగా ఫార్మసిస్ట్​ నాగేందర్​ మందుల దందా చేస్తుండగా.. ఆసుపత్రికి చెందిన ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నేళ్ల నుంచి నేరుగా ఫార్మసి నుంచే మందులు సరఫరా చేస్తుంటే ఆ విషయం ఆఫీసర్ల దృష్టికి రాకపోవడం పట్ల సందేహాలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి పోలీస్​ అధికారులు, డ్రగ్​ కంట్రోల్​ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

IPL_Entry_Point