Hyderabad Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం-drinking water supply to be interrupted on february 1 in vraious parts of hyderabad area wise details check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

Hyderabad Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 30, 2025 09:32 AM IST

హైదరాబాద్‌ నగర వాసులకు జలమండలి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీన పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని ప్రకటించారు. మరమ్మతుల పనుల కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ లో నీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌ నగర వాసులకు అలర్ట్…! ఫిబ్రవరి 1వ తేదీన పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు.

నసర్లపల్లి సబ్‌స్టేషన్‌లోని 132 కేవీ బల్క్ లోడ్ ఫీడర్ మరమ్మతులు పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన టీజీ ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతులు చేపడతారని వివరించారు. దీంతో కృష్ణా ఫేజ్-1, 2, 3 నుంచి సరఫరా అయ్యే రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఆరు గంటల పాటు తాగునీటి సరఫరాలో పాక్షికంగా అంతరాయం ఉంటుందని తెలిపారు.

ఏ ఏ ప్రాంతాలంటే..?

మీరాలం, కిషన్ బాగ్, శాస్త్రిపురం, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, అస్మాన్ గఢ్, యాకుత్‌పురా, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్, భోజగుట్ట, షేక్‌పేట్, బొగ్గులకుంట, అఫ్జల్‌కుంట, శివం రోడ్డు, నారాయణగూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పాక్షిక అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, రైల్వే, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ, రియాసత్ నగర్, అలియాబాద్, బండ్లగూడ, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్ నగర్, సాహెబ్ నగర్ ప్రాంతాలపై కూడా ప్రభావం ఉండనుంది.

వైశాలినగర్, అల్కాపురి, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మహేంద్ర హిల్స్, రామంతపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, దేవేందర్ నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, దుర్గానగర్, బుద్వేల్, గోల్డెన్ హైట్స్, హార్డ్‌వేర్ పార్క్, గంధంగూడ, బోడుప్పల్‌లలో కూడా నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తనున్నాయి.

మల్లికార్జున నగర్, చెంగిచెర్ల, భరత్ నగర్, ఆనంద్ నగర్ క్రాస్ రోడ్లు, పీర్జాదిగూడ, మీర్‌పేట్, కూర్మగూడ, లెనిన్ నగర్, బడంగ్‌పేట్ ఏరియాలపై ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. నీటి సరఫరా నిలిచిపోవటంతో పాటు ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం