తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా... త్వరలోనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించిన తర్వాత... గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. అయితే కీలకమైన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసే వారికి ఉండాల్సిన అర్హతలెంటో ఇక్కడ తెలుసుకోండి...
ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం… రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు అక్టోబర్ 13, 21, 25 తేదీల్లో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4, మూడో విడత నవంబర్ 8 నిర్వహిస్తామన్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వా ఫలితాలు వెల్లడిస్తారు. మెుత్తం ఐదు దశల్లో ఎన్నికలను ప్లాన్ చేశారు.
12,733 గ్రామ పంచాయితీలకు గానూ 1,12, 288 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికలకు 15,522 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.ఇక ఓటర్ల వివరాల విషయానికొస్తే.. పురుషులు 81,65,894, మహిళలు 85,36,770 మంది, ఇతరులు 504 మంది ఓటర్లు ఉన్నారు.
సంబంధిత కథనం