TG LRS Application Grievance : ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో ఇబ్బందులా..? ఇలా ఫిర్యాదు చేయండి
Telangana LRS Application Grievance: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సర్కార్ ఫోకస్ పెట్టింది. 25 శాతం డిస్కౌంట్ ఇవ్వటంతో చాలా మంది ఛార్జీలను చెల్లించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ స్టేటస్ లేదా ఫీజు చెల్లింపుతో పాటు ఇతర విషయాల్లో ఏమైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేసుకోవచ్చు.
అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్కీమ్ అమలులో వేగం పెంచేందుకు 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది. దీంతో అప్లికేషన్ చేసుకున్న చాలా మంది క్రమబద్ధీకరణ ఫీజులను చెల్లించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది వివరాలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. స్టేటస్ కూడా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆయా దరఖాస్తులకు అధికారుల నుంచి అప్రూవ్ వస్తేనే ఛార్జీల వివరాలు వెబ్ సైట్ లో డిస్ ప్లే అవుతాయి. లేకపోతే నో డేటా అని కనిపిస్తుంది. అప్రూవ్ అయిందా లేదా అనేది కూడా ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ లోనే తెలుసుకోవచ్చు. ఫీజుల చెల్లింపు, అఫ్రూవ్ చేయటంతో పాటు ఇతర విషయాల్లో ఏమైనా సందేహాలు, ఇబ్బందులు ఉంటే... ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఎలాగో ఇక్కడ చూడండి...
దరఖాస్తులపై ఇబ్బందులా..? ఫిర్యాదు ప్రాసెస్ ఇలా….
- ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల ఎల్ఆర్ఎస్ తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఈ వెబ్ సైట్ లోకి వెళ్లగానే ఆఫీసియల్ లాగిన్, సిటిజన్ లాగిన్ కనిపిస్తుంది. ఇందులో మీరు సిటిజన్ లాగిన్ పై నొక్కాలి.
- ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి. మీకు ఓటీపీ వస్తుంది.ఆ నెంబరును ఎంట్రీ చేయాలి.
- వెరిఫైయిడ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ Raise Grievance అని ఉంటుంది.
- దీనిపై క్లిక్ చేస్తే రీజన్ (Reason), అప్లికేషన్ నెంబర్, Grievance Description అని ఉంటుంది. ఇక్కడ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ గ్రీవెన్స్ పూర్తవుతుంది.
ఇక మార్చి 31వ తేదీతో ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపు గడువు పూర్తి కానుంది. ఈ తేదీలోపు ఫీజు చెల్లించినవారికి మాత్రమే... రాయితీ నిర్ణయం వర్తింస్తుంది. అంతేకాకుండా.... వెబ్ సైట్ మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీ దరఖాస్తుపై జనరేట్ అయిన ఫీజును కూడా చెల్లించవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం లేదా ఇతర మార్గాల ద్వారా పేమెంట్ చేసుకునే ఆప్షన్లు ఇందులో ఉంటాయి. ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తయితే... ఆ వివరాలు కూడా వెబ్ సైట్లో అప్ లోడ్ అవుతాయి.
సంబంధిత కథనం