జూన్‌ 2న రాజీవ్ యువ వికాసం లబ్దిదారులకు రుణాల పంపిణీ, క్యాటగిరీ 1, 2 లబ్దిదారులకు తొలి విడతలో రుణాలు…-distribution of units to rajiv yuva vikasam beneficiaries on june 2 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జూన్‌ 2న రాజీవ్ యువ వికాసం లబ్దిదారులకు రుణాల పంపిణీ, క్యాటగిరీ 1, 2 లబ్దిదారులకు తొలి విడతలో రుణాలు…

జూన్‌ 2న రాజీవ్ యువ వికాసం లబ్దిదారులకు రుణాల పంపిణీ, క్యాటగిరీ 1, 2 లబ్దిదారులకు తొలి విడతలో రుణాలు…

Sarath Chandra.B HT Telugu

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారులకు జూన్‌ 2న ఉపాధి యూనిట్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి 5లక్షల మందికి పథకాన్ని అందించాలని భావిస్తోంది. దశల వారీగా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాజీవ్ యువ వికాసంపై బిగ్ అప్డేట్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాజీవ్ యువ వికాసం యూనిట్లను అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబరు 2 నాటికి తెలంగాణలో 5 లక్షల మంది యువతకు రూ.8,000 కోట్ల విలువైన స్వయం ఉపాధి యూనిట్లను అందచేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాజీవ్ యువవికాసం పథకం లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి స్కీమ్‌ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు అన్ని నియోజక వర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని భట్టి ఆదేశించారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, వెంటనే స్వయం ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని చెప్పారు.

జూన్ 2న పథకాన్ని యువ వికాసం పథకాన్ని ప్రారంభించి.. గాంధీ జయంతి నాటికి రూ.8 వేల కోట్లతో ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అక్టోబర్‌ వరకు ప్రతి నెలా ఈ కార్యక్రమం చేపట్టి దశలవారీగా పూర్తి చేయాలని, జిల్లా ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

గిగ్‌ వర్కర్లకు మోటర్‌ సైకిళ్లు..?

తెలంగాణలో గిగ్ వర్క ర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాల కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వాలని పట్టణ ప్రాంతాల్లోని యువత కోరుతున్నారని.. యువ వికాసంలో గిగ్‌ వర్కర్లుగా పనిచేసే వారికి కూడా అవకాశం కల్పించాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

పది ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో వేర్వేరు సంక్షేమ శాఖల ద్వారా అందించిన మొత్తాన్ని ప్రజాప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే యువవికాసం పథకం ద్వారా ఇస్తున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఇది ఓ రికార్డు అని.. ఏ రాష్ట్రంలోనూ ఏడాది వ్యవధిలో స్వయం ఉపాధి కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు.

యువ వికాసం పథకాన్ని విజయవంతం చేయడం కోసం వారం క్రితమే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించామని.. ఆ తర్వాత సంక్షేమ శాఖల అధికారులు బ్యాంకర్లతో మాట్లాడుతూ రుణాల మంజూరు ప్రక్రియను చివరి దశకు చేర్చడంపై అభినందించారు.

జూన్ 2న నిర్వహించే మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావుకు సూచించారు. రాజీవ్‌ యువ వికాసంలో క్యాటగిరీలో 1లో రూ.50వేల లోపు రుణాలను ఎలాంటి పూచీకత్తు లేకుండా అందిస్తారు. క్యాటగిరీలో 2లో బ్యాంకు లింకేజీలతో రూ.లక్ష రుణాన్ని అందిస్తారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం