Padi VS Balmuri: డైలాగ్ వార్... ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్-dialogue war mla padikaushik reddy vs mlc balmuri venkat ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Padi Vs Balmuri: డైలాగ్ వార్... ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

Padi VS Balmuri: డైలాగ్ వార్... ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 06, 2024 06:56 AM IST

Padi VS Balmuri: వర్షం వరదలతో పాటు నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతుంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. వర్షం వరదలతో జనం ఇబ్బందులతో చస్తుంటే అవేమి పట్టనట్లు కొందరు నేతలు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బల్మూరి వెంకట్, పాడి కౌశిక్ మధ్య మాటల యుద్ధం
బల్మూరి వెంకట్, పాడి కౌశిక్ మధ్య మాటల యుద్ధం

Padi VS Balmuri: ఏపీ తెలంగాణలో వర్షం వరదలు తో జనజీవన స్తంభించి ప్రజలు ఇక్కట్లు పడుతుంటే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై పరస్పర విమర్శలు సంధించుకుని ప్రజల దృష్టిని ఆకర్షించారు.

ప్రభుత్వం పోన్ ట్యాప్ చేస్తుంది.. కౌశిక్ రెడ్డి

ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపిల ఫోన్ల ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని బిఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మేము ఎక్కడికి వెళ్లిన వారికి సమాచారం ఉంటుందన్నారు. మా పర్సననల్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందని ప్రశ్నించారు.‌

సీపీ టేలికాన్ఫరెన్స్ పెట్టుకోవడం పర్సనల్ విషయం...సీపీ ఫోన్ కూడా ట్యాప్ జరుగుతుందన్నారు.‌ మా ఫోన్ చేయరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు.‌ జమ్మికుంట లో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి పోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పోలీస్ యంత్రాంగం ఒక సెక్యూరిటీ వింగ్...ప్రజల సేఫ్టివింగ్, ఆలాంటి పోలీస్ ల ఫోన్ ట్యాప్ చేయడం సిగ్గు చేటన్నారు. మా పోన్ లను ట్యాపింగ్ చేస్తున్నారనేందుకు సిపి పోనే ఉదాహరణ అని తెలిపారు. సీపీ సీఐకి కాన్ఫరెన్స్ పెడుతలేరని మంత్రికి, ఎమ్మెల్యేకు ఎలా తెలుసన్నారు. మేము పోస్టింగ్ లు ఇప్పిస్తే సీపీ తీసుకోవడం లేదని ఎమ్మెల్యే అంటుండు.. పైరవీలకు తావు లేదని ముఖ్యమంత్రి చెప్పాడు...మరీ మీ ఎమ్మెల్యే చెబుతున్నదానికి అర్థం ఏంటనీ ప్రశ్నించారు.

మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? అన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ చెక్కులైన పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేకు హక్కు ఉంటుందని, ప్రభుత్వం నుండి వచ్చే ఫండ్స్ కాంగ్రెస్ ఫండ్స్ కావు, ఇవి ప్రజల సొమ్మని తెలిపారు. ఒడి పోయినోడు చెక్కులు పంచుతుండు... దీనిపై హై కోర్టుకు వెళ్తానని చెప్పారు. తెలంగాణలో పరిపాలన దరిద్రంగా ఉందని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్టించుకోవాలని కోరారు. మీ పార్లమెంట్ పరిధిలో సిపి ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.

ఇక రుణ మాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేవలం 40శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. ఏక కాలంలో రుణ మాజీ చేస్తామని చెప్పింది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.

కౌశిక్ రెడ్డి కి ఇంకిత జ్ఞానం లేదు.. బల్మూరి వెంకట్

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి కి శాసన సభ్యుడిగా కనీసం ఇంకిత జ్ఞానం లేదని విమర్శించారు.‌ తాడి చెట్టు లెక్క పెరిగిండు... కానీ బుర్ర పెరగలేదన్నారు. కార్యకర్తగా, యువనాయకుడనుకుంటున్నాడేమో...ఆయన ఒక నియోజక వర్గానికి శాసన సభ్యులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.‌ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి, మా నాయకులకు లేదన్నారు.‌ కేసీఆర్ కేటీఆర్ మెప్పు పొందడానికి

కౌశిక్ రెడ్డి ఫోన్ టాపింగ్ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆరోపించారు.‌ ఫోన్ ట్యాపింగ్ పై ఉక్కుపాదం మోపిందే సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. టీవీలలో కనిపించడానికి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటున్నాడని అలాంటి దౌర్భాగ్యం మీ కేసీఆర్, కేటిఆర్ లదేనని ఆరోపించారు. కటకటాలలో ఉన్న అధికారులను అడిగితే తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి సోయి తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)