Gaddar Awards : ఉగాదికి గద్దర్ సినీ అవార్డులు ప్రదానం,నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం-డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు-deputy cm bhatti vikramarka state gaddar cine awards distribution on ugadi to support tollywood ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gaddar Awards : ఉగాదికి గద్దర్ సినీ అవార్డులు ప్రదానం,నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం-డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

Gaddar Awards : ఉగాదికి గద్దర్ సినీ అవార్డులు ప్రదానం,నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం-డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 18, 2025 07:52 PM IST

Gaddar Cine Awards : ఉగాదికి గద్దర్ తెలుగు చలన చిత్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గద్దర్ అవార్డు కమిటీతో డిప్యూటీ సీఎం ఇవాళ భేటీ అయ్యారు. ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు

ఉగాదికి గద్దర్ సినీ అవార్డులు ప్రదానం, కమిటీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ
ఉగాదికి గద్దర్ సినీ అవార్డులు ప్రదానం, కమిటీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ

Gaddar Cine Awards : ఈ ఉగాదికి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గద్దర్ అవార్డులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మకంగా అవార్డుల ప్రదానోత్సవం

గద్దర్ అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయస్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు. కల్చరల్ ఐకాన్ గద్దర్ ప్రతిష్టపెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలని డిప్యూటీ సీఎం తెలిపారు.

సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత పది సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించిన వారు చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారు, అవార్డుల పంపిణీ జరగలేదని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఈ విభాగాల్లో అవార్డులు

రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవన్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అవార్డులలో నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందచేస్తారు. గద్దర్ అవార్డుకు సంబంధించి లోగోను కూడా రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Whats_app_banner

సంబంధిత కథనం