Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై బిగ్ అప్డేట్, పాలమూరు నుంచి శ్రీకారం-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు
Indiramma Illu Update : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు.

Indiramma Illu Update : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు నుంచి ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రచారం చేయాలని సమాచార, పౌర సంబంధాల శాఖ హౌసింగ్ శాఖలపై సమీక్షలో వెల్లడించారు.
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్ లు
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు నిర్శించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. మధ్యతరగతి ప్రజల కోసం ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ పేరిట ఇళ్లు కట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించింది. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల చొప్పున బడ్జెట్లో నిధులు కేటాయించామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఇందిర్మ ఇళ్ల దరఖాస్తుల స్టేటస్ కోసం
తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారు తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వెబ్ సైట్ లోకి వెళ్లి వారి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఏ కేటగిరి కింద ఉందో కూడా తెలుసుకునే వీలు ఉంది. ఆ జాబితాలో ఉండటానికి గల కారణాలను కూడా ఇందులో చేర్చారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే ఆన్ లైన్ లోనే ఫిర్యాదు చేసేలా గ్రీవెన్స్ ఆప్షన్ ను తీసుకొచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్ తనిఖీ
- ముందుగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే మోర్ పై నొక్కి అప్లికేషన్ సెర్చ్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ దరఖాస్తుదారుడి మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా ప్రజాపాలన అప్లికేషన్ నెంబర్ లేదా,FSC (పుడ్ సెక్యూరిటీ కార్డు) నెంబర్ ను నమోదు చేసి గో ఆప్షన్ పై నొక్కాలి.
- అప్లికేషన్ వివరాలు స్ర్రీన్ పై డిస్ ప్లే అవుతాయి. లిస్ట్ టైప్ పక్కన L1, L2,L3 కనిపిస్తాయి. దీని ఆధారంగా మీ అప్లికేషన్ ఏ కేటగిరిలో ఉందో తెలుస్తుంది.
- ఇక్కడ కనిపించే వివరాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే raise grievanceపై నొక్కి ఆన్ లైన్ లోనే ఫిర్యాదు చేయవచ్చు.
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలు రిజిస్ట్రర్ చేసుకునేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా తీసుకువచ్చింది. సందేహాలు నివృత్తి చేయడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం 040-29390057 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుపొచ్చు. ప్రభుత్వం తీసుకువచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ అన్ని పని దినాల్లో పని చేస్తుంది. ఇదే కాకుండా కొన్ని జిల్లాల కలెక్టరేట్లలో కూడా ప్రత్యేక నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
సంబంధిత కథనం