'రాజీవ్ యువ వికాసం స్కీమ్' దరఖాస్తుదారులకు బిగ్ రిలీఫ్...! ఎంపిక ప్రక్రియపై కీలక ప్రకటన-deputy cm bhatti vikramarka key statement on telangana rajiv yuva vikasam scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'రాజీవ్ యువ వికాసం స్కీమ్' దరఖాస్తుదారులకు బిగ్ రిలీఫ్...! ఎంపిక ప్రక్రియపై కీలక ప్రకటన

'రాజీవ్ యువ వికాసం స్కీమ్' దరఖాస్తుదారులకు బిగ్ రిలీఫ్...! ఎంపిక ప్రక్రియపై కీలక ప్రకటన

రాజీవ్ యువ వికాసం స్కీమ్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. లబ్ధిదారుల ఎంపిక సిబిల్ స్కోర్ ఆధారంగా జరుగుతుందన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

రాజీవ్ యువ వికాసం స్కీమ్

తెలంగాణ రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తుదారులకు శుభవార్త వచ్చేసింది. సిబిల్ స్కోర్ ఆధారంగా అర్హుల ఎంపిక ఉంటుందన్న ప్రచారానికి తెర పడింది. ఇదే విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.

సిబిల్ స్కోర్ ప్రచారం అవాస్తవం - భట్టి విక్రమార్క

రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక సిబిల్ స్కోర్ ఆధారంగా జరుగుతుందని చేస్తున్న ప్రచారం అవాస్తవమని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు వరంగా రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువచ్చామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం యువత జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

రాజీవ్ యవ వికాసం అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా… వేగంగా జరుగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా శాంక్షన్ లెటర్ల పంపిణీ జరుగుతుందన్నారు. అభ్యర్థులు ధైర్యంగా ఉండాలని… తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

మరోవైపు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అర్హుల ఎంపిక ప్రక్రియపై తెలంగాణ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మండల స్థాయిలో వెరిఫికేషన్ జరుగుతుండగా… ఆపై జిల్లా కమిటీలకు సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత అర్హుల జాబితాలను వెల్లడిస్తారు. అయితే అర్హుల ఎంపికలో సిబిల్ స్కోర్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. సిబిల్‌ స్కోర్ బాగుంటేనే స్కీమ్ కు అర్హత లభించే అవకాశం ఉంటుందనే వార్తలు ప్రచారమయ్యాయి. ఈ వార్తలతో చాలా మంది దరఖాస్తుదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా రాయితీ అందుతుంది. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేటగిరీ-1 కింద రూ.50 వేల విలువైన యూనిట్‌కు వంద శాతం రాయితీ ఉంటుంది. బ్యాంక్ లింకేజీ లేకుండానే ఈ రుణాన్ని అమలు చేస్తారు. కానీ మిగతా కేటగిరిలో మాత్రం బ్యాంక్ లింకేజీని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. జూన్ 2వ తేదీన అర్హులైన వారికి ప్రోసిడింగ్ కాపీలను అందజేస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం