Smitha Vs Balalatha: IAS కొట్టాలంటే అందగత్తె కావాల్సిన అవసరం లేదు, దమ్ముంటే తనతో పోటీ పడాలని బాలలత సవాల్
Smitha Vs Balalatha: దివ్యాంగులపై తెలంగాణ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. స్మితా సబర్వాల్‌కు ఉన్న అధికారం ఏమివటని మాజీ బ్యూరోక్రాట్, సివిల్స్ శిక్షకురాలు బాలలత ప్రశ్నించారు. స్మితాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Smitha Vs Balalatha: సివిల్ సర్వీసెస్‌లో దివ్యాంగుల్ని అనుమతించకూడదంటూ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను మాజీ బ్యూరోక్రాట్ , సివిల్స్ ట్రైనర్ బాలలత తప్పు పట్టారు. స్మితా సబర్వాల్ ఏ అధికారంతో ఆ వ్యాఖ్యలు చేశారో సమాధానం చెప్పారు. తనలాంటి వైకల్యంతో బాధపడే ఎంతోమందిని స్మితా వ్యాఖ్యలు బాధించాయని ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించేలా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఎలా మాట్లాడారని, గుర్తింపు కోసం కొందరు సివిల్ సర్వెంట్స్ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగుల మీద, సమాజం మీద తీవ్ర ప్రభావం చూపుతాయని, వివక్షకు గురయ్యే దివ్యాంగులను అవమానించేలా, వారిని దూరం పెట్టాలని స్మితా చెప్పారన్నారు.
పని ఉన్న వాళ్లు ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కాలం గడపరని, వికలాంగుల మీద వ్యాఖ్యలు చేయరని, ప్రభాస్, మహేష్ బాబు సర్జరీలు చేయరని, మిస్ ఇండియాలు, మిస్ వరల్డ్‌లు సివిల్స్ రాయరని బాలలత ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి దివ్యాంగురాలికి అపాయింట్‌మెంట్ ఇచ్చారని, స్మిత వ్యాఖ్యలు వ్యక్తిగతమో, తెలంగాణ ప్రభుత్వ వైఖరో చెప్పాలన్నారు.
దివ్యాంగులపై వివక్ష పూరితంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏ అధికారంతో, ఏ విధానంతో ఆమె వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారో చెప్పాలని, చీఫ్ సెక్రటరీ దీనిపై స్పందించాలన్నారు.
జైపాల్ రెడ్డికి రెండు కాళ్లు లేకపోయినా బెస్ట్ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని, ఎన్నో కేంద్ర ప్రభుత్వ శాఖల్ని సమర్ధవంతంగా నడిపించారని, జైపాల్ రెడ్డి స్మారక కేంద్రం స్ఫూర్తి స్థల్ హైదరాబాద్‌లోనే ఉందని, అలాంటి నగరంలో ఆమె వ్యాఖ్యలు గర్హనీయమన్నారు.
దివ్యాంగులకు తక్కువ మార్కులేమి రావని, వైకల్యాన్ని ముందే చెప్పిన తర్వాత పరీక్షలకు హాజరు కావాల్సి ఉందన్నారు. ఖేర్కర్ విషయంలో ఆమె వికలాంగురాలు కాదని, యూపీఎస్సీ వైకల్యంతో లేదని, ఆమెకు సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్
సివిల్ సర్వెంట్లు గోప్యత పాటించాల్సి ఉండగా సోషల్ మీడియా ఖాతాలను కేంద్రం ఎందుకు అనుమతిస్తోందని బాలలత ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ, సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని , లక్షలాది మంది స్మితా సబర్వాల్ ట్వీట్‌ను చూశారని, ఆమె తన వ్యాఖ్యల్ని సమర్థించుకునేలా చేసిన మాటలు రీ ట్వీట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24గంటల్లో బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే తాము జైపాల్ రెడ్డి సమాధి వద్ద శాంతియుతంగా నిరసనకు దిగుతామన్నారు.
స్మితా తండ్రి ఐఏఎస్, భర్త ఐపీఎస్‌గా ఉన్నారని, అన్ని అవకాశాలు ఉండి ఆమె ఐఏఎస్ అయ్యారని, సభ్య సమాజానికి ఏమి చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
తాను ఎప్పుడో 165 ర్యాంక్ సాధించి, ఉద్యోగానికి రాజీనామా చేశానని, స్మితాకు సవాలు చేస్తున్నా, ఇప్పుడు తనతో పోటీ పడి మళ్లీ పరీక్ష రాయాలని సవాలు చేశారు. అంధులైన తన విధ్యార్థులతో స్మితా పోటీ పడాలని బాలలత డిమాండ్ చేశారు.
స్మిత వ్యాఖ్యలకు ప్రభావితమైతే ఎవరైనా ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగం ఎవరైనా ఇస్తారా, ఆమె ముమ్మాటికి నిబంధనలు ఉల్లంఘించారని, సీఎస్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. పదేళ్లు సిఎంఓలో పనిచేశారని, ఆమెకు ఫిజికల్ డిజేబిలిటీ లేకపోయినా మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యారన్నారు. తెలంగాణలో వికలాంగులు ఉండకూడదు అని చెబితే అదే చేస్తామన్నారు. రాజకీయ పార్టీలు కూడా స్మితా వైఖరిని ఖండించాలన్నారు.
తన సర్వీస్‌లో కూడా కొందరు తోటి అధికారులు ఇలాంటి వారు ఉండబట్టే తాను సర్వీస్ నుంచి వైదొలగి ఐఏఎస్‌లను తయారు చేసే ట్రైనింగ్ ఇస్తున్నట్టు చెప్పారు. స్మితాకు తనకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఏది పడితే అది రాస్తానంటే కుదరదన్నారు. స్మితా వైఖరిని బ్యూరోక్రాట్స్ ఖండించాలన్నారు.
స్మితా సబర్వాల్‌కు ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఆమె పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తమకు న్యాయం కావాలని స్మితాను కేంద్రానికి సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. 2012లో ఔట్‌లుక్ మ్యాగ్‌జైన్ ఆమె గురించి అనుచిత కథనం ప్రచురిస్తామో తాము నొచ్చుకున్నామని గుర్తు చేశారు.
నకిలీ పత్రాలతో ఐఏఎస్ అర్హత పొందిన మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ పూజా వ్యవహారంలో వికలాంగులను కించపరిచేలా స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
సంబంధిత కథనం