Hyderabad : ఆరేళ్ల కిందట తప్పిపోయిన తండ్రి.. కూతుళ్లు అన్నదానం చేస్తుండగా ప్రత్యక్షం.. కన్నీళ్లు ఆపుకోలేరు!-daughters get emotional after seeing father who went missing six years ago in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : ఆరేళ్ల కిందట తప్పిపోయిన తండ్రి.. కూతుళ్లు అన్నదానం చేస్తుండగా ప్రత్యక్షం.. కన్నీళ్లు ఆపుకోలేరు!

Hyderabad : ఆరేళ్ల కిందట తప్పిపోయిన తండ్రి.. కూతుళ్లు అన్నదానం చేస్తుండగా ప్రత్యక్షం.. కన్నీళ్లు ఆపుకోలేరు!

Basani Shiva Kumar HT Telugu
Nov 19, 2024 01:29 PM IST

Hyderabad : ఆయనకు మతిస్థిమితం లేదు. ఆరేళ్ల కిందట తప్పిపోయాడు. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి ఏరియాలో తిరుగుతుండగా.. అనాథ ఆశ్రమం వారు ఆశ్రయం ఇచ్చారు. అదే ఆశ్రమంలో అన్నదానం చేయడానికి వచ్చిన అతని కూతుళ్లకు కనిపించాడు. దీంతో కూతుళ్లు కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

తండ్రిని హత్తుకొని ఏడుస్తున్న కూతుళ్లు
తండ్రిని హత్తుకొని ఏడుస్తున్న కూతుళ్లు

ఆరు సంవత్సరాల కిందట తప్పిపోయిన కన్నతండ్రిని చూసి.. కూతుళ్లు బాగోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బాలయ్య అనే వ్యక్తికి మతిస్థిమితం లేదు. దీంతో ఆయన ఆరేళ్ల కిందట తప్పిపోయాడు. జూబ్లిహిల్స్‌లోని పెద్దమ్మ గుడి వద్ద తిరుగుతుండగా.. మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వారు గమనించారు. తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు.

ఆరేళ్లుగా బాలయ్య అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. బాలయ్య కూతురు దివ్య.. నెల రోజుల కిందట ఆ ఆశ్రమంలో ఉన్నవారికి అన్నదానం చేయడానికి వచ్చింది. అప్పుడు ఆశ్రమం నిర్వాహకులతో.. తమ కన్నతండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడు అని చెప్పింది. తాజాగా మళ్లీ దివ్య అదే అశ్రమానికి అన్నదానం చేయడానికి వచ్చింది. అప్పుడు ఊహించని ఘటన జరిగింది.

ఆశ్రమంలో ఉన్న 130 మందికి దివ్య అన్నదానం చేస్తోంది. ఈ క్రమంలో తన తండ్రి బాలయ్య కూడా అక్కడే కనిపించాడు. కన్నతండ్రిని గుర్తుపట్టి బాలయ్య కూతురు బాగోద్వేగానికి గురయ్యారు. తండ్రని హత్తుకొని ఏడ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ తండ్రి దొరికినందుకు సంతోషంగా ఉందని దివ్య చెబుతున్నారు.

తండ్రిని ఇంతకాలం ఎంతగా మిస్ అయ్యామని, ఇంతకాలం కన్నతండ్రి ప్రేమకు దూరమయ్యామని కన్నీరు పెట్టుకున్నారు. తమ వెంట ఉన్నపుడు తండ్రి విలువ తెలియదని.. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలని బాలయ్య కూతుళ్లు కోరుతున్నారు. ఇన్నాళ్లు తమ తండ్రికి ఆశ్రయం ఇచ్చిన మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పారు.

Whats_app_banner